Begin typing your search above and press return to search.
చంద్రబాబు లవ్ ప్రపోజల్ తో నేతల్లో అయోమయం
By: Tupaki Desk | 9 Jan 2022 1:30 PM GMTచంద్రబాబునాయుడు బహిరంగంగా చేసిన లవ్ ప్రపోజల్ తో తమ్ముళ్ళల్లో అయోమయం పెరిగిపోతోంది. కుప్పం మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతు పొత్తుల విషయంలో తాను లవ్ ప్రపోజల్ పంపినా జనసేన నుండి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పిన విషయం తెలిసిందే. అప్పటికే రాబోయే ఎన్నికల్లో జనసేనతో టీడీపీకి పొత్తుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ-జనసేన మిత్రపక్షాలు కాబట్టి టీడీపీతో జనసేన పొత్తు అనుమానమే అనే వాదన కూడా ఉంది.
అయితే తాజాగా స్వయంగా చంద్రబాబే జనసేనతో పొత్తుకు రెడీ అని చెప్పేయటంతో తమ్ముళ్ళ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఒకవేళ టీడీపీతో పొత్తుకు పవన్ కల్యాణ్ అంగీకరిస్తే ఎన్నిసీట్లు ఇచ్చుకోవాలనే విషయమై కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. ఎంత తక్కువేసుకున్నా జనసేనకు 50 సీట్లయితే వదులుకోక తప్పదనే టాక్ నడుస్తోంది. అదే నిజమైతే మరా 50 సీట్లు ఏవనే విషయంలో చర్చలు మొదలయ్యాయి. రాయలసీమ, ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలోనే ప్రధానంగా జనసేనకు 50 సీట్లు వదులుకోవాలని నేతల్లో చర్చలు జరుగుతున్నాయి.
పొత్తుల విషయం ఫైనల్ కాకుండా తమను నియోజకవర్గాల్లో తిరగాలని, కష్టపడి పనిచేయాలని చంద్రబాబు ఒకవైపు చెబుతు మరోవైపు జనసేనతో పొత్తుకు ప్రయత్నించటం ఏమిటంటు నేతలు మండిపోతున్నారు. పొత్తుల విషయంలో ఇంత అయోమయం పెట్టుకుని తమను నియోజకవర్గాల్లో తిరగమని చెప్పటంలో అర్ధంలేదంటున్నారు. తాము కష్టపడి తిరిగిన తర్వాత పొత్తుల్లో తమ సీట్లను జనసేనకు వదులుకుంటే అప్పుడు తామేంచేయాలనే చర్చే తమ్ముళ్ళల్లో పెరిగిపోతోంది.
పార్టీలో తమ్ముళ్ళ మధ్య జరుగుతున్న చర్చను చూసిన తర్వాత కుప్పంలో పొత్తు విషయాన్ని బహిర్గతం చేసి చంద్రబాబు తప్పుచేశారనే అభిప్రాయం పెరిగిపోతోంది. చివరి నిముషంలో పొత్తులంటే అప్పుడు తమ్ముళ్ళు చేయగలిగేదేమీ లేదు. కానీ రెండున్నరేళ్ళ ముందే పొత్తు ప్రయత్నాల గురించి ప్రకటించేసి మరోవైపు తమను పార్టీ కోసం కష్టపడమనటం ఏమిటంటు తమ్ముళ్ళు మదనపడుతున్నారు. జనసేనతో పొత్తు, ఎన్ని సీట్లు వదులుకుంటారు, వదులుకునే సీట్లేవి అనే విషయంలో క్లారిటీ రానంతవరకు తమ్ముళ్ళు సీరియస్ గా నియోజకవర్గాల్లో తిరిగేది అనుమానమే.