Begin typing your search above and press return to search.
కర్నూలులో కొత్త వివాదం.. వైసీపీ నేతల వ్యూహం ఏంటి?
By: Tupaki Desk | 14 Oct 2022 4:12 AM GMTకర్నూలుకు చెందిన వైసీపీ నాయకులు.. కొత్త రూటు పట్టారు. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న వైసీపీ ఎమ్మె ల్యేలు.. కాటసాని రాంభూపాల్‌రెడ్డి వంటి సీనియర్లు.. రోడ్డెక్కారు. ఇప్పటి వరకు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. కానీ, ఒకవైపు.. రైతులు ఏకైక రాజధాని కోసం.. ఉద్యమిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా కాటసాని వంటివారు రోడ్డెక్కడం.. ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఇంతకీ.. ఆయన ఏమన్నారంటే.. కర్నూలు ను.. న్యాయ రాజధాని చేయాలని కోరడమే!
సరే..ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండేకదా.. అని అనుకుంటున్నారా? ఉంది. కానీ, ఎప్పుడూ.. కాటసా ని వంటివారు కోరలేదు. అదేవిధంగా కర్నూలులోనూ.. వైసీపీ నాయకులు ఎవరూ ముందుకు రాలేదు. కానీ, ఇప్పుడు కొత్తగా.. ప్రత్యేకంగా మాత్రం వారు పావులు కదుపుతున్నారు. అంతేకాదు.. న్యాయ రాజధాని ని చేయకపోతే.. తమను తెలంగాణలో కలిపేయాలని కూడా.. ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. ఈ పరిణామమే ఇప్పుడు చర్చకు వస్తోంది.
దీనికి కారణం.. ఏంటి? ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కాటసాని వంటి బడా కాంట్రాక్టర్లు.. ననేతలు.. రంగంలో కి దిగడానికి రీజన్ ఏంటి? అంటే.. అధిష్టానం నుంచి వచ్చిన అదిలింపులే కారణమని.. కర్నూలు జిల్లా వాసులు గుసగుసలాడుతున్నారు. కాటసాని కుటుంబం పెద్దది.
ఆయన సోదరులు కూడా.. రాజకీయాల్లో ఉన్నారు. అదేసమయంలో వారు బడా కాంట్రాక్టు పనులు కూడా చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లోనూ వారికి పనులు దక్కాయి. దీనికి ప్రధానంగా.. పార్టీ ఆశీర్వాదం ఉందనే.. వాదన ఉంది.
అయితే.. ఇప్పుడు ఇలాంటి బలమైన నాయకులు ముందుకు రాకపోవడంపై.. పార్టీ అధిష్టానం గుర్రుగా ఉందని.. స్థానికంగా టాక్ వినిపిస్తోంది. కర్నూలు గురించి.. పార్టీ గురించి కూడా.. కాటసాని అసలు పట్టిం చుకోలేదనే టాక్ ఉంది.
పొరుగు రాష్ట్రాల్లో పనులు , వ్యాపారాలు చేసుకోవడంతోనే ఆయన బిజీగా గడిపే స్తుంటారని.. అలాంటిది అనూహ్యంగా ఇప్పుడు.. ఈ వాదన ఎంచుకోవడం వెనుక.. బలమైన 'హెచ్చరికలే' పనిచేస్తున్నాయని చెబుతున్నారు. మాట వినకపోతే.. రిజల్ట్ వేరేగా ఉంటుందని వచ్చిన వార్నింగులతోనే ఆయన కదిలాడని అంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.