Begin typing your search above and press return to search.
బెంగళూరులో కలకలం సృష్టిస్తున్న దక్షిణాఫ్రికా స్ట్రెయిన్
By: Tupaki Desk | 11 March 2021 12:30 PM GMTదేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు పలు నగరాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా గత 24 గంటల్లో 20 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ భయంతో వణికిపోతుంటే , కర్ణాటకలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ అది. కొత్త స్ట్రెయిన్ కేసు నమోదు కావడం కర్ణాటకలో ఇదే తొలిసారి. ఇప్పటిదాకా కర్ణాటకలో 29 బ్రిటన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శివమొగ్గ జిల్లాకు చెందిన వ్యక్తిలో కరోనా దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి.
ఆ వ్యక్తి ఇటీవలే బ్రిటన్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. కరోనా ప్రొటోకాల్ ప్రకారం.. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఆ నమూనాలను మరింత లోతుగా పరీక్షించారు. వైరస్ జెనెటిక్ సీక్వెన్స్ ఆధారంగా అతనికి సోకింది దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ గా నిర్ధారించారు. వెంటనే ఆ వ్యక్తిని తొలుత సంస్థాగత క్వారంటైన్ కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ దక్షిణాఫ్రికాయ వేరియంట్‌ను గత ఏడాది డిసెంబర్‌లో గుర్తించిన విషయం తెలిసిందే. అంతకుముందే బ్రిటన్ స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ స్ట్రెయిన్ వల్ల యూకే సహా కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ను విధించాల్సి వచ్చింది. తాజాగా రాష్ట్రంలోకి దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ కూడా ఎంట్రీ ఇచ్చింది.