Begin typing your search above and press return to search.
పిల్లల్లో కొత్త కరోనా లక్షణాలు..గుర్తించండిలా!
By: Tupaki Desk | 6 Sept 2020 7:00 AM ISTకరోనా వ్యాధి వ్యాప్తి మొదలై 10 నెలలు అయినా ఇప్పటి వరకు కరోనా లక్షణాలు ఇవి అని చెప్పడానికి లేదు. ఆ వైరస్ లక్షణాలు అన్నింటిని ఇంకా గుర్తించలేదు. ఇప్పటికీ దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది వైద్య నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు. రోజుకో లక్షణం గుర్తించి దాని గురించి వెల్లడిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, శ్వాస సమస్యలు, గొంతు నొప్పి ప్రాథమిక లక్షణాలుగా గుర్తించారు. ఆ తర్వాత వాసన పీల్చే శక్తి కోల్పోవడం, కళ్ళు ఎర్ర బడటం, ఎక్కిళ్ళు, నోట్లో పూత వంటివి కూడా కరోనా లక్షణాలేనని ప్రకటించారు. అయితే పిల్లల్లో మాత్రం కరోనా లక్షణాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
బ్రిటన్ లో నిర్వహించిన ఓ అధ్యయనంలో వికారం, వాంతులు, డయేరియా లక్షణాలు కనిపిస్తే కోవిడ్ లక్షణాలుగా భావించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులపై పరిశోధనలు జరుపగా ఈ లక్షణాలు బయట పడ్డాయి. వాషింగ్టన్ నేషనల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్వహించిన అధ్యయనంలో పిల్లల్లో కరోనా వైరస్ ఉన్న సమయంలో కూడా యాంటీ బాడీల సంఖ్య మెరుగ్గానే ఉన్నట్లు గుర్తించారు. 215 మంది పిల్లలను పరీక్షించగా 33 మందిలో యాంటీ బాడీలు గుర్తించారు. అంటే యాంటీ బాడీలు ఉన్న పిల్లలు కూడా వైరస్ ని వ్యాప్తి చేయగలరు. మామూలుగా కరోనా బారిన పడ్డ పెద్దలకు వ్యాధి నుండి కోలుకున్న 20 రోజులకు యాంటీ బాడీల ఉత్పత్తి మొదలవుతుంది. కానీ పిల్లల్లో పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా యాంటీ బాడీలు ఉండటం ఆశ్చర్యకరం.