Begin typing your search above and press return to search.

మరో కొత్త కరోనా వేవ్.. రోజుకు 50వేల కేసులు

By:  Tupaki Desk   |   23 Jun 2022 12:30 PM GMT
మరో కొత్త కరోనా వేవ్.. రోజుకు 50వేల కేసులు
X
చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ మాయదారి కరోనా తగ్గినట్టే తగ్గి చాపకింద నీరులా రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. కొత్త రూపంతో ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తోంది. మొన్నటి వరకూ ఉత్తరకొరియాను వణికించిన కరోనా తాజాగా ఫ్రాన్స్ ను దడ పుట్టిస్తోంది. కొత్త కొత్త వేవ్ లు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

వర్షకాలం రావడంతో యూరప్ దేశాలు ఈ కరోనా ఉధృతి పెరిగి అల్లాడిపోతున్నాయి. ఇప్పటికే కరోనా రెండో, మూడో వేవ్ లతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చనిపోయారు. లక్షల మంది వ్యాధి బారిన ఒల్లు, ఇళ్లు గుల్ల చేసుకున్నారు. ఇప్పుడు కొత్త కొత్త వైరస్ వేరియంట్ల పేరిట వైరస్ రూపాంతరం చెంది పదిరెట్లు వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది.

ఫ్రాన్స్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ తాము కరోనా కొత్త వేవ్ ను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. కానీ కొత్త వేవ్ తీవ్రత ఎంత వరకూ ఉంటుందనేది మాత్రం చెప్పలేమన్నారు.

ఫ్రాన్స్ దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్క్ ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రజా రవాణాలో మాస్క్ తప్పనిసరి చేయాలన్నారు.

ఫ్రాన్స్ లో గత నెల చివరి వారం నుంచి కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఏడు రోజుల వ్యవధిలోనే రోజువారీ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగాయి. గత నెల 27న 17705 కేసులు నమోదయ్యాయి. తాజాగా 50402మందిలో వైరస్ బయటపడింది. ఇటు పక్కనున్న పోర్చుగల్ దేశంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఒమిక్రాన్ వేరియంట్ రూపాంతరం చెంది బీఏ4, బీఏ5గా మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు ఫ్రాన్స్ అధికారులు చెబుతున్నారు.దీనివల్లే కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. అక్కడి శాస్త్రవేత్తలు, వైద్యులు ఇప్పుడు కొత్త వేరియంట్లపై పరిశోధన జరుపుతున్నారు. వైరస్ బారిన పడిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని.. దీర్ఘకాలిక రోగాలున్న వారికి మాత్రమే డేంజర్ గా ఉందని వారు చెబుతున్నారు.

ఇప్పటికే బ్రిటన్ లోనూ కొత్త కరోనా వేరియంట్లను కనుగొన్నారు.. 'ఎక్స్.ఈ' అనే ఒమిక్రాన్ కొత్త కోవిడ్ సబ్ వేరియంట్ పంజా విసురింది.. ఒమిక్రాన్ బీఏ2 సబ్ వేరియంట్ కంటే 10శాతం అధికంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని హెచ్చరించింది.

'ఎక్స్.ఈ' కరోనా వేరియంట్ మొదటిసారిగా యూకేలో కొనుగొన్నారు. 600 కంటే ఎక్కువ 'ఎక్స్.ఈ' కేసులు నిర్ధారణ అయ్యాయి. యూకేలో జనవరి 19న ఈ ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి కనుగొన్నారు. 600 కంటే ఎక్కువ 'ఎక్స్ ఈ' కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎక్స్ ఈ వంటి రీకాంబినెంట్ వేరియంట్ లకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ రిస్క్ ను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ తెలిపారు.

ఎక్స్.ఈ తీవ్రత, వేగం వంటి లక్షణాలను గుర్తించబడే వరకూ ఇది ఒమిక్రాన్ వేరియంట్ లో భాగంగానే వర్గీకరిస్తామని డబ్ల్యూ.హెచ్.వో తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వీ1.1.529, బీఏ1,బీఏ2 మరియు బీఏ3తో సహా నాలుగు వేరియంట్లను కలిగి ఉంటుందని తెలిపింది. ఇందులో బీఏ2 అని పిలవబడే స్టీల్త్ వెర్షన్ కూడా ఉంది. ఇది ఒమిక్రాన్ యొక్క ప్రారంభ కేసు తర్వాత కొంతమందికి మళ్లీ సోకినట్లు నమోదు చేయబడింది. ఇప్పుడు ఇదే వైరస్ సబ్ వేరియంట్ ఫ్రాన్స్ లో కల్లోలానికి కారణమవుతున్నట్టు తెలిసింది.