Begin typing your search above and press return to search.

క‌రోనా కొత్త వైర‌స్‌ శ‌వాల గ‌ట్ట‌లు!

By:  Tupaki Desk   |   2 April 2021 2:30 AM GMT
క‌రోనా కొత్త వైర‌స్‌ శ‌వాల గ‌ట్ట‌లు!
X
బ్రెజిల్ లో క‌రోనా విల‌యం సృష్టిస్తోంది. నిత్యం వేల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వ‌డ‌మే కాకుండా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప‌రిస్థ‌తుల్లో మ‌రో కొత్త ర‌కం వైర‌స్ క‌నుగొన‌డంతో దేశం యావ‌త్తూ చిగురుటాకులా వ‌ణికిపోతోంది.

బుధ‌వారం ఒక్క రోజే బ్రెజిల్ లో 89, 200 కేసులు న‌మోద‌య్యాయి. 3,950 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ మార‌ణ‌హోమానికి క‌రోనా మ్యుటేష‌న్ ర‌కమే కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. కేసులు పెర‌గ‌డంతోపాటు మ‌ర‌ణాలు అధికంగా సంభ‌వించ‌డానికి కూడా ఇదే కార‌ణ‌మ‌ని అంటున్నారు.

అయితే.. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌రో కొత్త మ్యుటేష‌న్ ను గుర్తించారు నిఫుణులు. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ప్ర‌మాద‌క‌ర‌ వేరియంట్ ను ఈ వైర‌స్ పోలి ఉన్న‌ట్టు తేల్చారు. అయితే.. బాధిత వ్య‌క్తి ద‌క్షిణాఫ్రికా వెళ్లింది లేదు. అక్క‌డి నుంచి వ‌చ్చిన వారితో కాంటాక్ట్ అయ్యింది కూడా లేదు.

దీంతో.. బ్రెజిల్ లోనే ఈ త‌ర‌హా వేరియంట్ రూపాంత‌రం చెంది ఉంటుంద‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ దానిపై ఏ మేర‌కు ప‌నిచేస్తుంద‌నేది కూడా తెలియ‌ద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే.. శ‌వాల గుట్టలు పేరుకుపోతున్న నేప‌థ్యంలో.. రాబోయే రోజుల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని జ‌నం తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.