Begin typing your search above and press return to search.
సీఆర్ డీఏ కార్యాలయం అదుర్స్
By: Tupaki Desk | 25 Aug 2015 9:50 AM GMTనవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కీలకమైన కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్ డీఏ) ప్రధాన కార్యాలయం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు అరకొర వసతులతో పూర్తయ్యాయి. తాజాగా రూ.2 కోట్లతో నిర్మించిన రెండో అంతస్తు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చింది. ఇందులో కొత్త గా నిర్మించిన కాన్ఫరెన్స్ హాలు, హైటెక్ తరహాలో నిర్మించిన క్యూబికల్స్ అద్భుతంగా ఉన్నాయని ఉద్యోగులు అంటున్నారు. ప్రత్యేక చాంబర్లు, క్యూబికల్స్, సౌకర్యవంతమైన సీట్లు, సెంట్రలైజ్డ్ ఏసీ, తెల్లటి ఏనుగులు విరజిమ్మే విద్యుత్తు దీపాలు, ఆకట్టుకునే ఇంటీరియర్ - ఫర్నిషింగ్స్ - ఫ్లోరింగ్ - వైఫై తదితరాలు అద్భుతంగా ఉన్నాయని, సీఆర్ డీఏ కార్యాలయానికి అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ కళ వచ్చేసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు మొదటి, గ్రౌండ్ ఫ్లోర్లలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, డైరెక్టర్లంతా రెండో అంతస్తులోకి మారిపోయారు. ఇందులో అధికారులకు పది చాంబర్లతో పాటు 72 మంది సిబ్బంది ఎటువంటి ఇబ్బంది లేకుండా విధులు నిర్వర్తించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతర్గత సమావేశాల నిర్వహణకు మూడు కన్ఫరెన్స్ హాళ్లను నిర్మించారు. సెన్సర్లతో కూడిన గాజు తలుపులు, అధునాతన వసతులతో రిసెప్షన్, సిబ్బందికి అవసరమైన కాఫీ, టీ అందించేందుకు వీలుగా పాంట్రీ రూమ్ కూడా ఉంది. ప్రఖ్యాత హోటళ్ల లోని రెస్ట్ రూమ్ ల మాదిరిగా మరుగు దొడ్లనూ అధునాతనంగా రూపుదిద్దుతున్నారు.