Begin typing your search above and press return to search.
సెకెండ్ వేవ్ లో కొత్త సంక్షోభం .. 5 ,6 నెలల పాటు లక్షణాలు !
By: Tupaki Desk | 31 May 2021 4:00 PM ISTదేశంలో కరోనా సెకండ్ వేవ్ జోరు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతోంది. ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు , వేలకొద్ది కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే , కరోనా జోరు తగ్గుతుంది అని అనుకుంటున్న సమయంలోనే సెకెండ్ వేవ్ కొత్త సంక్షోభాలను సృష్టిస్తోంది. కరోనా బారిన పడిన కొంతమంది బాధితులు కోలుకున్న తరువాత కూడా పలు ఆరోగ్యపరమైన అవస్థలు పడుతున్నట్లు తేలింది. కరోనా భారిన పడిన వారు ఐదారు నెలల పాటు కరోనా లక్షణాలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితికి వైద్య పరంగా లాంగ్ కరోనా అనే పేరు పెట్టారు.
దీని గురించి ఢిల్లీలోని ఎయిమ్స్ కోవిడ్ వైద్య నిపుణులు డాక్టర్ నీరజ్ నిశ్చల్ మాట్లాడుతూ లాంగ్ కోవిడ్ లక్షణాలు కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు చెందిన బాధితులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బాధితులు కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా సుమారు ఐదారు నెలల పాటు వారిలో కోవిడ్-19 క్షణాలు కనిపిస్తున్నాయన్నారు. తీవ్రమైన కోవిడ్ ఎదుర్కొన్న బాధితులలో ఎక్కువగా ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. స్వదేశంలో, విదేశాల్లో సుమారు 20 శాతం మంది రోగులు సుదీర్ఘ కోవిడ్ తో బాధపడుతున్నారని ఆయన చెప్పారు.. కరోనా నుండి కోలుకున్న తరువాత బాధితులు ఎక్కువగా అలసటకు గురవుతారని అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ఒక అధ్యయనంలో కరోనా నుంచి కోలుకున్నవారిలో 11.8 శాతం బాధితులు తీవ్రమైన అలసటకు గురవుతున్నారని తేలింది. 10.9 శాతం మందిలో దీర్ఘకాలిక కఫ లక్షణాలు కనిపించాయి. 6.4 శాతం మంది రుచి కోల్పోవడం, 6.3 శాతం మంది సువాసన, 6.2 శాతం మంది గొంతు నొప్పి, 5.6 శాతం మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎయిమ్స్‌లో లాంగ్ కోవిడ్ బాధితుల డేటాను సిద్ధం చేస్తున్నట్లు డాక్టర్ నీరజ్ తెలిపారు.