Begin typing your search above and press return to search.

ఏపీలో తాజాగా 98 పాజిటివ్‌ - మూడు వేలు దాటిన కేసులు

By:  Tupaki Desk   |   31 May 2020 12:37 PM GMT
ఏపీలో తాజాగా 98 పాజిటివ్‌ - మూడు వేలు దాటిన కేసులు
X
ఆంధ్రప్రదేశ్‌ లో వైర‌స్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా పాజిటివ్ కేసుల న‌మోదు రోజురోజుకు కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఆదివారం 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా 24 గంటల్లో 9,370 న‌మూనాల‌ను పరీక్షించగా 98 మందికి వైర‌స్ సోకింద‌ని వైద్యారోగ్య ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో వైర‌స్ బారిన ప‌డిన వారిలో తాజాగా 43 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జయ్యార‌ని వెల్ల‌డించింది. రాష్ట్రంలో మొత్తం 3,042 పాజిటివ్ కేసులకు గాను 2,135 మంది డిశ్చార్జయ్యార‌ని వివ‌రించింది. ఇప్ప‌టివ‌ర‌కు 62 మంది వైర‌స్‌తో మృతిచెందార‌ని, 845 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయ‌ని తెలిపింది.

ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన వారికి..

తాజాగా కృష్ణ జిల్లాలో ఒకరు - చిత్తూరులో ఒకరు మరణించారు. ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 111 మందికి కరోనా నిర్ధారణ కాగా.. వారిలో ఇంకా ఒక్కరు కూడా కోలుకోలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 418 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వారిలో ఇవాళ 8 మంది డిశ్చార్జయ్యారు. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 197కు చేరింది. మిగిలిన 221 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో నిర్వహించిన వైర‌స్ పరీక్షల సంఖ్య 4 లక్షలకు చేరువలో ఉంది.