Begin typing your search above and press return to search.
జూన్ నెలాఖరుకు కరోనా విలయమే..
By: Tupaki Desk | 7 Jun 2020 12:30 PM GMTదేశ రాజధాని ఢిల్లీ కరోనా కేసులతో అట్టుడుకుతోంది. జూన్ నెలాఖరు నాటికి ఢిల్లీలో కరోనా కేసులు లక్ష దాటడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే విలయతాండవమే అని ఢిల్లీ సర్కార్ ఆందోళన చెందుతోంది..
ఢిల్లీలో ప్రస్తుతం మహమ్మారి వైరస్ విస్తరిస్తోంది. ప్రతిరోజు 1000కిపైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది.
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 1320 పాజిటివ్ కేసులు.. 53 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27654కి చేరింది. ఇప్పటిదాకా ఢిల్లీలో 761మంది చనిపోయారు. దేశంలో సంభవిస్తున్న కేసుల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.
తాజాగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ బాంబు పేల్చింది. జూన్ చివరి నాటికి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని నివేదించింది. జూన్ 8నుంచి ఢిల్లీలో అన్ని మాల్స్, రెస్టారెంట్స్ తెరుచుకుంటున్నాయి. దీంతో ఈ వైరస్ జూన్ నెలాఖరు నాటికి విజృంభించడం ఖాయమని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కొత్తగా 15వేల బెడ్స్ ను ఢిల్లీ సర్కార్ సిద్ధం చేస్తోంది.