Begin typing your search above and press return to search.
కేసుల నమోదులో టాప్ లో రాజస్థాన్: కల్లోలం సృష్టిస్తున్న వైరస్
By: Tupaki Desk | 31 May 2020 2:29 PM GMTమహమ్మారి వైరస్ విషయంలో ప్రపంచ పటంలో భారతదేశం టాప్‌లో నిలిచేందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే దేశంలో కేసుల విషయంలో కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడి టాప్‌లో ఉండేలా వైరస్ విస్తరిస్తోంది. అంతలా మహమ్మారి కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా విజృంభిస్తోంది. భారతదేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో ఉంటోంది. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా ఎనభై వేలు దాటింది. వీరిలో ఐదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 90 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా 70 వేల మందికి పైగా వైరస్ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు.
ఈ కేసుల నమోదులో దేశంలోనే టాప్ లో రాజస్థాన్ నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 8 వేలు దాటగా ఇప్పుడు 9 వేలకు చేరింది.రువలో ఉంది. ఆదివారం నాడు.. కొత్తగా మరో 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,693కి చేరింది. ఇక తాజాగా కరోనా బారినపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌తో మొత్తం మరణించిన వారి సంఖ్య 194కి చేరింది. తాజాగా 20 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు.
ఆ రాష్ట్రంలో కోలుకున్నవారు 5,772 మంది ఉన్నారు. మిగతా వారు పర్యవేక్షణలో ఉన్నారు. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఆ ఒక్క నగరంలోనే 1,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కట్టడి చర్యలు పట్టిష్టంగానే అమలుచేస్తున్నారు.