Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: ఆ ప్రముఖ ఆలయంలో 29మందికి కరోనా!
By: Tupaki Desk | 8 Aug 2020 1:27 PM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా కరోనాకు అడ్డాగా మారింది. రోజుకు 1000కు పైగానే కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా ఇదే తూర్పుగోదావరి జిల్లాలోని ప్రఖ్యాత అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో 29మందికి కరోనా వైరస్ సోకింది. ఉద్యోగులు, అర్చకులు కలిపి 29మందికి వైరస్ వచ్చినట్టు తేలిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే అన్నవరంలో ఈనెల 14వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. నిత్య ఆర్థిత సేవలు కొనసాగుతాయని తెలిపారు.
అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న 300మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 29మందికి నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే ఏపీలోని టీటీడీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కరోనాతో కన్నుమూశారు. దీంతో అర్చకుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.