Begin typing your search above and press return to search.

కరోనా రోగిని డిశ్చార్జ్ చేస్తామన్నారు.. వచ్చి చూస్తే షాక్

By:  Tupaki Desk   |   27 July 2020 1:30 AM GMT
కరోనా రోగిని డిశ్చార్జ్ చేస్తామన్నారు.. వచ్చి చూస్తే షాక్
X
ఏపీలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. 7వేలకు పైగా కేసులు నమోదవుతుండడం.. లక్షకు మొత్తం కేసులు చేరుకోవడం వైద్య సహాయం అందించడం కనాకష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో వైరస్ సోకిన బాధితుల పట్ల అధికారులు.. వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కోవిడ్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. కూచుంపూడి గ్రామానికి చెందిన కళాతోటి అన్నపూర్ణకు కరోసా సోకడంతో ఈనెల 13వ తేదిన ఏలూరు ఆస్పత్రిలో చేర్చారు.

మూడు రోజుల క్రితం కరోనా బాధితురాలిని డిశ్చార్జ్ చేస్తామని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అధికారులను అడగగా.. మె కనిపించడం లేదని చెప్పారు. తీరా రికార్డులు పరిశీలిస్తే ఆమె మృతి చెందినట్లుగా ఉంది. కనీసం మృతదేహం చూపించమన్నా సాధ్యం కాదని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనాతో చనిపోయినా కూడా కుటుంబానికి చెప్పకుండా నిర్లక్ష్యం వహించిన ఏలూరు ఆస్పత్రి సిబ్బంది తీరుపై స్థానికులు మండిపడ్డారు.