Begin typing your search above and press return to search.
మహమ్మారి రికార్డ్: 24 గంటల్లో 8వేలకు పైగా కేసులు
By: Tupaki Desk | 31 May 2020 10:29 AM GMTలాక్ డౌన్ 5వ విడత మరిన్ని సడలింపులు వచ్చాయని సంబరపడాలో లేక.. దేశంలో మహమ్మారి మరింతగా కోరలు చాస్తుందని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది.
భారత్ లో రోజురోజుకు మహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో కొత్త రికార్డ్ తరహాలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా కేంద్ర - ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 8360 పాజిటివ్ కేసులు నమోదు కావడం సరికొత్త రికార్డ్ గా చెబుతున్నారు. దేశంలో వైరస్ ప్రబలిన తర్వాత ఇన్ని కేసులు ఒక్కరోజులో ఇప్పటిదాకా నమోదు కాకపోవడం గమనార్హం.
తాజాగా దేశంలో నమోదైన 8360 కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,82,143కి చేరింది. ఇక మరణాల లోనూ రికార్డ్ నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా దేశవ్యాప్తంగా 193మంది మరణించడం విషాదం నింపింది. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన మొత్తం వారి సంఖ్య ఏకంగా 5164కు చేరడం గమనార్హం. ఇది కూడా 5వేల మార్క్ దాటడం రికార్డ్ గా చెబుతున్నారు.
దేశంలోనే ఇప్పటిదాకా 8వేలకు పైగా కేసులు.. ఒకే రోజు 200వరకు మరణాలు సంభవించడం సరికొత్త రికార్డుగా అభివర్ణిస్తున్నారు. ఇన్ని కేసులు తాజా సడలింపులు.. విదేశాల నుంచి వచ్చిన వారు.. వలస కూలీల కారణంగానే నమోదవుతున్నాయని తెలుస్తోంది.