Begin typing your search above and press return to search.
గాలి ద్వారా కరోనా.. కొత్త పరిశోధనలో నిజమిదీ!
By: Tupaki Desk | 14 Aug 2020 5:30 AM GMTకరోనా ముక్కు, కళ్లు, నోరు, పిత్తడం ద్వారా వ్యాపిస్తుందని అందరికీ తెలిసిపోయింది. గాలి ద్వారా కూడా రెండు మీటర్ల దూరంలోపు వ్యాపిస్తుందని తెలుసు. కానీ ఇఫ్పుడు కొత్త పరిశోధనలో కరోనా వ్యాప్తికి దూరం తగ్గిపోయిందని తెలిసింది. ఇన్నాళ్లు కనీసం ఆరు అడుగులు లేదా 4.8 మీటర్ల దూరం ఉంటే కరోనా రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పుడా దూరం సరిపోదని తేలింది.
ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు చేసిన పరిశోధనలో వైరస్ వ్యాప్తిపై సరికొత్త అంశాలు వెలుగుచూశాయి. గాలి ద్వారా వ్యాపించడానికి ఆధారాలు వారు కనుగొన్నారు. వైరస్ వ్యాప్తిపై మార్గదర్శకాలు సవరించాలని పరిశోధకులు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరారు. ఈ మేరకు మెడ్ రెక్సిన్ జర్నల్ లో ఇది ప్రచురితమైంది.
ఇండోర్ వాతావరణంలో 2 మీటర్ల నుంచి 4.8 మీటర్ల దూరం వరకు గాలి ద్వారా వైరస్ సంక్రమిస్తుందని పరిశోధకులు కనిపెట్టారు. చిన్న చిన్న తుంపర్లలోని కరోనా వైరస్ రేణువులు గాల్లో అలాగే ఉంటున్నాయని తేల్చిచెప్పారు. దగ్గుతూ, చీదుతూ, మాట్లాడే వారి సమీపంలో గాలి పీల్చడం ద్వారా కరోనా సోకుతుందని తెలిపారు.
కొత్త పరిశోధనలో వైరస్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో మార్గదర్శకాలు మార్చాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.