Begin typing your search above and press return to search.
ఏపీలో కల్లోలం రేపుతున్న మహమ్మారి!!
By: Tupaki Desk | 22 July 2020 12:11 PM GMTమహమ్మారి వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్లోలం రేపుతోంది. రోజురోజుకు ఊహించని రీతిలో కేసులు పెరుగుతున్నాయి. దానికి తోడుగా మరణాలు కూడా తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లో వైరస్ ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా రికార్డులు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 6,045 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. తాజాగా వైరస్‌తో బాధపడుతూ 65 మంది మృత్యువాత పడ్డారు. ఈ విధంగా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దేశంలో సామూహిక వ్యాప్తి మొదలైందని వార్తలు వెలువడుతుండడంతో ఏపీలో కూడా ఆ పరిస్థితి ఏర్పడిందా అనేలా కేసులు నమోదవుతున్నాయి.
ఒక్కరోజే 49,553 నమూనాలు పరీక్షించడంతో అన్నేసి కేసుల వెలుగులోకి వచ్చాయి. కొత్త పద్ధతిల్లో పరీక్షలు చేస్తుండడంతో కేసులు అమాంతం పెరగడానికి కారణమైంది. తాజాగా 6,494 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు చేరారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 31,763.. మొత్తం డిశ్చార్జయిన వారి సంఖ్చ 32,127... మొత్తం మృతుల సంఖ్య 823. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చేసిన పరీక్షలు 14,35, 827.
ప్రస్తుతం ఏపీలో 31,605 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అనంతపురం( 6266) - కర్నూలు(7797) - గుంటూరు(6913) - తూర్పుగోదావరి( 8647)లలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి.