Begin typing your search above and press return to search.
ఏపీలో అదే జోరు.. 9536 కొత్త కరోనా కేసులు
By: Tupaki Desk | 13 Sep 2020 4:00 PM GMTఏపీలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు 10వేలకు కేసులు తగ్గడం లేదు. ఆదివారం కూడా అదే జోరు కొనసాగింది.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 9536 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72233 టెస్టులు చేయగా దాదాపు 10వేల కేసులు వెలుగుచూశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,67,123కు పెరిగాయి.
ఇక కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య ఏకంగా 66 గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4912కు పెరిగింది. అనంతపురంలో 7, నెల్లూరులో 7, ప్రకాశంలో 7 మరణించారు.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే కేసులు 76వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో తూ.గోదావరిలో అత్యధికంగా ఏకంగా 1414 కేసులు నమోదయ్యాయి.