Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్: ఏపీలో తగ్గిన కరోనా కేసులు

By:  Tupaki Desk   |   27 Sep 2020 4:30 PM GMT
గుడ్ న్యూస్: ఏపీలో తగ్గిన కరోనా కేసులు
X
రోజుకు 10వేల చొప్పున కేసులు నమోదవుతున్న ఏపీలో తాజాగా కరోనా తీవ్రత తగ్గడం ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో కరోనా కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. డిశ్చార్జీలు పెరుగుతున్నాయి. గతంతో పోలీస్తే ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. ఇక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరోజులోనే 1000కు పైగా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6923 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 76416 టెస్టులు చేయగా దాదాపు 7వేల దాకా కేసులు వెలుగుచూశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కు పెరిగాయి.

ఇక కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య మళ్లీ భారీగా తగ్గిపోయాయి. ఆదివారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య ఏకంగా 45గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5708కు పెరిగింది.

ఇక తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో కరోనా వైరస్ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి లక్షన్నరకు పైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 94190 మందికి , శ్చిమ గోదావరి జిల్లాలో 64433 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.