Begin typing your search above and press return to search.
కరోనా విషయంలో ఏపికి హ్యాపీ న్యూస్
By: Tupaki Desk | 11 Oct 2020 4:56 PM GMTదాదాపు ఏడు మాసాలుగా రాష్ట్రాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కాస్త నెమ్మదించింది. వైరస్ వ్యాప్తి విషయంలో ఏపికి ఇది హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి. పరీక్షల సంఖ్య పెంచుతున్న వైరస్ భారిన పడిన బాదితుల సంఖ్య తగ్గుతోంది. ఇదే సమయంలో కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుండటం నిజంగా సంతోషించాల్సిన విషయమే కదా.
గడచిన 24 గంటల్లో రాష్ట్రం మొత్తం మీద 75,517 మందికి కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు జరిగాయి. ఇందులో 5210 మందికి మాత్రమే వైరస్ ఉన్నట్లు తేలింది. ఇదే సంఖ్య ఒకపుడు 10 వేలను కూడా టచ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుత బాధితుల సంఖ్య 7,55,727కి చేరుకుంది. ఒక్క రోజులో 30 మరణించటం నిజంగా బాధాకరమనే చెప్పాలి. జిల్లాల వారీగా మరణించిన వారి సంఖ్యను తీసుకుంటే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 8 మంది మరణించారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున చనిపోతే శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో చెరొకరు మరణించారు. తాజా సంఖ్యతో కలుపుకుని మరణాల మొత్తం సంఖ్య 6224కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురంలో 165, చిత్తూరు జిల్లాలో 412 - తూర్పుగోదావరి జిల్లాలో 208 - గుంటూరులో 348 - కడపలో 174 - కృష్ణాజిల్లాలో 388 - కర్నూలులో 124 - నెల్లూరులో 219 - ప్రకాశంలో 230 - శ్రీకాకుళంలో 165 - వైజాగ్ లో 96 - విజయనగరంలో 90 - పశ్చిమగోదావరిలో 327 కేసులు రిజస్టర్ అయ్యాయి. గడచిన 24 గంటల్లో 5504 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇఫ్పటి వరకు వైరస్ నుండి 7 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 46295 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ చెప్పింది.