Begin typing your search above and press return to search.

రాబోయే రోజుల్లో భారత్ పరిస్థితి దారుణమేనా?

By:  Tupaki Desk   |   19 July 2020 10:30 AM GMT
రాబోయే రోజుల్లో భారత్ పరిస్థితి దారుణమేనా?
X
130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం మనది. ముట్టుకుంటే అంటుకునే కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆవహించిన వేళ భారత్ లోనూ సామూహిక వ్యాప్తి దశలోకి వచ్చేసిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వల్ల భారతదేశంలో దారుణమైన పరిస్థితులు ఏర్పడవచ్చంటూ ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్టు సంచలన కథనాన్ని ప్రచురించింది. కరోనాతో భారత్ అల్లకల్లోలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని ఆ కథనంలో హెచ్చరించారు.

ప్రముఖ అంతర్జాతీయ పత్రిక రాసిన ఈ కథనంలో భారత్ లో కరోనాను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదని వ్యాఖ్యానించింది. కరోనాను జయిస్తున్నామన్న భారత్.. గ్రామీణ ప్రాంతాల్లో కరోనాను కట్టడి చేయలేకపోతోందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది.

పట్టణాలతో పోలిస్తే భారత్ లో గ్రామీణ ప్రాంతాల్లో సరైన మౌలిక వసతులు లేవని.. కాబట్టి రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా మారొచ్చని పత్రిక కథనంలో పేర్కొంది.

ఆ పత్రిక పేర్కొన్నట్టుగానే దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఏకంగా రోజుకు 40వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. 10 లక్షల కేసులు దాటేశాయి. కరోనాను కంట్రోల్ చేయలేక ప్రభుత్వాలు తలపట్టుకుంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఎంతటి వినాశనం కలుగుతుందోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఆ భయాలకు వాషింగ్టన్ పోస్టు పత్రిక కథనం ఆజ్యం పోసినట్టైంది.