Begin typing your search above and press return to search.

భారత్ లో కరోనా: 30లక్షలకు కేసులు..56వేల మరణాలు

By:  Tupaki Desk   |   23 Aug 2020 7:30 AM GMT
భారత్ లో కరోనా: 30లక్షలకు కేసులు..56వేల మరణాలు
X
భారత్ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 70వేల కేసులు నమోదవుతున్నాయి. 900 మరణాలు రికార్డ్ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 69239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ తాజాగా కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 30,44,940కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 22లక్షల 80వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7 లక్షల 7వేల క్రియాశీల కేసులున్నాయి. తాజాగా 24 గంటల్లో 912 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 56706కు చేరింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండడం విశేషంగా మారింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు దాదాపు 74.69కు చేరింది. మరణాల రేటు 1.87శాతంగా ఉంది.

*తెలంగాణలో కరోనా

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2384 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,249కు చేరింది. నిన్న 11మంది మృతి చెందారు. హైదరాబాద్ లో 472 కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 755కు చేరింది.

*ఏపీలో రికార్డ్ స్ఘాయి కేసులు

ఏపీలో కరోనా కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 61469మందికి కరోనా పరీక్షలు చేయగా 10276మందికి పాజిటివ్ గా వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,216కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 8,593మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 97మంది మృతి చెందారు.