Begin typing your search above and press return to search.
దేశంలో కరోనా ఉధృతి..12 రోజుల్లోనే 10లక్షల కేసులు
By: Tupaki Desk | 13 Sep 2020 4:50 AM GMTకరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తోంది. విస్తృతంగా వ్యాపిస్తోంది. సెప్టెంబరు నెలలో ఇప్పటివరకు ఏకంగా 10 లక్షల కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.
ఈనెలలో కేవలం 12 రోజుల్లోనే 10లక్షలకు పైగా కేసులు.. 13వేలకు పైగా మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ నెలలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాలేదు.
శనివారం దేశవ్యాప్తంగా 95249 కొత్త కేసులు వెలుగుచూశాయి. సెప్టెంబర్ లో 12 రోజుల్లో 10,65,796 కేసులు నిర్ధారణ అయ్యాయి. భారత్ లో ఆగస్టు మొత్తం మీద 19.8 లక్షల కేసులు నమోదు కాగా.. సెప్టెంబర్ లో 12 రోజుల్లోనే 10 లక్షలు దాటాయి.
ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ నెలలో ఇప్పటివరకు 13082 మంది చనిపోగా.. అమెరికా , బ్రెజిల్ లో 10వేల చొప్పున మరణాలు చోటుచేసుకున్నాయి. శనివారం మరో 1115 కరోనా బలికాగా.. దేశంలో కరోనా మరణాలు వరుసగా ఆరోరోజు 1000 దాటాయి.
శనివారం తొమ్మిది రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 4321, చత్తీస్ ఘడ్ 3964, హర్యానా 2783, మధ్యప్రదేశ్ 2347, జమ్మూకశ్మీర్ 1698 కేసులు నిర్ధారణ అయ్యాయి.
మహారాష్ట్రలో శనివారం అత్యధికంగా 22084 కేసులు బయటపడగా.. మరో 391 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఏపీలో గత 24 గంటల్లో 9901 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,57,587కు చేరాయి. మరో 67మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 4846కు చేరింది.