Begin typing your search above and press return to search.
భారత్ లో కరోనా: 60 లక్షలకు చేరువలో కేసులు
By: Tupaki Desk | 27 Sep 2020 9:12 AM GMTభారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిత్యం 85వేలకు పైగానే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే 88600 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా 9,87,861 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 59 లక్షల 92వేలకు చేరింది.
ఇప్పటివరకు 49 లక్షలమంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో నిన్న ఒక్కరోజే 92వేల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఊరట కలిగిస్తోంది.
ప్రస్తుతం దేశంలో 9.56 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా సోకి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం దాదాపు 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మరో 1124మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు.
దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 94503కు చేరింది. ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్న వారిలో దాదాపు 70శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తోంది.