Begin typing your search above and press return to search.
తెలంగాణ అప్డేట్ : 1,284 పాజిటివ్.. ఆరుగురి మృతి
By: Tupaki Desk | 18 July 2020 6:02 PM GMTమహమ్మారి వైరస్ తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది. వారం రోజులుగా వెయ్యిన్నర లోపు కేసులు నమోదవుతున్నాయి. గతంలో దాదాపు రెండు వేలకు చేరువలో కేసులు నమోదైన పరిస్థితి నుంచి ఆ సంఖ్య కొంత తగ్గిందని చెప్పవచ్చు. దానికి ఉదాహరణే తాజాగా నమోదైన కేసులు. కొత్తగా శనివారం 1,284 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. తాజా వాటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 43,780 చేరగా మృతుల సంఖ్య 409కి చేరింది.
వైరస్ నుంచి కోలుకుని తాజాగా 1,902 మంది డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి డిశ్చార్జయిన వారి సంఖ్య 30,607. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 12,760. కొత్తగా టెస్టులు 14,883 చేశారు. ఇప్పటివరకు చేసిన టెస్టులు 2,52,700. శనివారం ప్రకటించిన హెల్త్ బులెటిన్ లో ప్రభుత్వం పర్సంటేజీ కూడా వివరించింది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని సమగ్రంగా ప్రజల ముందు ఉంచుతోంది