Begin typing your search above and press return to search.

కొత్త డీల్: జెట్ ఎయిర్ వేస్ ఎవరి చేతుల్లోకి వెళ్లనుందంటే?

By:  Tupaki Desk   |   18 Oct 2020 6:10 AM GMT
కొత్త డీల్: జెట్ ఎయిర్ వేస్ ఎవరి చేతుల్లోకి వెళ్లనుందంటే?
X
దేశీయ ఎయిర్ వేస్ లో నెంబర్ 2 స్థానంలో ఉండి..అనూహ్యంగా అప్పులపాలైన జెట్ ఎయిర్ వేస్ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లనుంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. ఇప్పటికే ఫైనల్ అయిన డీల్.. ఒక కొలిక్కి రానుంది. జెట్ ఎయిర్ వేస్ ఇండియాను సొంతం చేసుకోవటానికి లండన్ కు చెందిన కల్రాక్ క్యాపిటల్.. వ్యాపార వేత్త మురారీ లాల్ జలాన్ కన్షార్టియం చేతుల్లోకి వెళ్లనున్నట్లు చెబుతున్నారు.

వీరు ఆఫర్ చేసిన బిడ్ ను జెట్ రుణ సంస్థల కమిటీ ఓకే చెప్పేయటం గమనార్హం. తాము వేసిన బిడ్ లో బ్యాంకులకు జెట్ ఎయిర్ వేస్ లో వాటాతో పాటు రూ.850 కోట్లను ఆఫర్ చేశారు. జెట్ ను తమ సొంతం చేసుకోవటానికి పలు సంస్థలు పోటీ పడినా.. చివరకు ఈ కన్సార్టియంకు జెట్ ఎయిర్ వేస్ దక్కనున్నట్లుగా చెబుతున్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో జెట్ ఎయిర్ వేస్ 2019 నుంచి ఆగిపోయింది. కంపెనీ అప్పులు రూ.8వేల కోట్లు ఉండగా.. సిబ్బందిజీతాలు.. ఇతర బకాయిలు చూస్తే దగ్గర దగ్గర రూ.40వేల కోట్ల మేర ఉన్నట్లు చెబుతారు.

ప్రయాణికుల సంఖ్య పరంగా చూసినప్పుడుదేశీయంగా రెండో అతిపెద్ద ఎయిర్ లైన్స్ గా జెట్ ను చెబుతారు. అలాంటి సంస్థలో ఒకప్పుడు 22 వేల మంది సిబ్బంది పని చేసేవారు. ఇదిలా ఉంటే.. జెట్ ను సొంతం చేసుకుంటున్న కన్సార్టియంలో మురారీ లాల్ జలాన్ విషయానికి వస్తే.. పశ్చిమబెంగాల్ కు చెందిన వ్యాపార కుటుంబంగా చెప్పాలి. వీరికి పేపర్ ట్రేడింగ్ లో మంచి పేరుంది. 1980లో స్టార్ట్ చేసిన వీరి వ్యాపారం తర్వాతి కాలంలో పేపర్ తయారీ.. రియాల్టీ.. హెల్త్ కేర్ రంగాలకు విస్తరించారు.

భారత్ తో ఆగకుండా రష్యా.. యూఏఈ లాంటి దేశాలకువిస్తరించిన వారు జెట్ డీల్ తో ఒక్కసారిగా వీరి పేరు వెలుగు లోకి వచ్చింది. కొత్త ఇమేజ్ వచ్చింది. మరి.. జెట్ డీల్ పూర్తి అయి.. వీరి హయాంలో ఎక్కడివరకు వెళుతుందో చూడాలి.