Begin typing your search above and press return to search.

ఢిల్లీ ప్రార్థనలతోనే 330కి పైగా కొత్త కేసులు నమోదు

By:  Tupaki Desk   |   2 April 2020 6:45 AM GMT
ఢిల్లీ ప్రార్థనలతోనే 330కి పైగా కొత్త కేసులు నమోదు
X
గత నెలలో ఢిల్లీలో జరిగిన ప్రార్థనలు ఇప్పుడు దేశానికి పెను విఘాతంగా మారాయి. మతపరమైన ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చారు. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారితో ఇక్కడికి వారికి కరోనా సంక్రమించింది. ఆ మీటింగ్ లో పాల్గొన్న వారితో భారతదేశంలో ఇప్పుడు కరోనావైరస్ కేసులు అకస్మాత్తుగా పెరిగాయి.

ఢిల్లీలోని జరిగిన సమావేశంలో పాల్గొన్న వారితో ఇప్పటికే 330 కన్నా ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో నమోదైన కేసులు డబుల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది.

భారతదేశంలో బుధవారం నాటికి ఢిల్లీ ఎఫెక్ట్ తోనే 2100 మందికి పైగా కరోనా వైరస్‌తో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం పరీక్షించిన కేసుల్లో ఎక్కువ శాతం ఢిల్లీ సమావేశంలో పాల్గొన్నవారే కావడం గమనార్హం. 330 మందిలో కరోనా పాజిటివ్ తేలింది. తమిళనాడులో అత్యధికంగా 190 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 70, ఢిల్లీలో 24, తెలంగాణలో 21, అండమాన్ లో 10, కాశ్మీర్‌లో ఒకటి, అస్సాంలో 13, పుదుచ్చేరిలో రెండు కేసులు నమోదయ్యాయి.వీరంతా ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొన్న వారే కావడం గమనార్హం.

ఈ ఢిల్లీ మీటింగ్ లో పాల్గొన్న వారంతా ఆసుపత్రులకు వచ్చి కరోనావైరస్ పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఢిల్లీ సమావేశంలో మలేషియా, ఇండోనేషియా వంటి ఇతర దేశాల నుండి కూడా వేలాది మంది ప్రజలు ఉన్నందున ఈ సమావేశానికి సంబంధించిన కేసులు ప్రతిరోజూ పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే, ఈ సమావేశాల నుండి తిరిగి వచ్చిన చాలామంది కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవడానికి ఇష్టపడడం లేదు. మధ్యప్రదేశ్ లో పరీక్షలు చేయడానికి వచ్చిన వైద్యులపై దాడులు కూడా చేశారు. ఏపీలోనూ వైద్య పరీక్షలకు చాలా మంది దూరంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.