Begin typing your search above and press return to search.
పోల్ సర్వేల్ని ఎన్నికలకు 6 నెలల ముందే బ్యాన్.. తెరపైకి కొత్త డిమాండ్!
By: Tupaki Desk | 10 Oct 2021 3:34 AM GMTసార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందు వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్ గా అభివర్ణించేవారు లేకపోలేదు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీ అధికారం ఎవరి చేతికి చిక్కితే.. సార్వత్రిక ఎన్నికల్లో వారి జోరు ఖాయమని చెప్పాలి. అత్యధిక ఎంపీ స్థానాలున్న యూపీలో ఎవరైతే పట్టును ప్రదర్శిస్తారో.. వారు జాతీయ స్థాయిలో కీలకభూమిక పోషించే వీలుంది. అందుకే.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంటాయి. మరికొద్ది నెలల్లోనే యూపీ అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో యోగి సర్కారుకు చెక్ పెట్టాలని విపక్షాలు భావిస్తుంటే.. ఏది ఏమైనా.. తమ అధిక్యతను కొనసాగించాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది.
ఇలాంటివేళ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. యూపీ ఎన్నికల వేళ.. ఓటర్లలో సానుకూలతను తీసుకొచ్చేందుకు బీజేపీ మాయాపోయాల్ని పన్నుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా చేసే ప్రచారానికి చెక్ చెప్పేందుకు వీలుగా కొత్త ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఎన్నికలు జరిగే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచి మీడియా సంస్థలు.. ఏజెన్సీలు ప్రీ పోల్ సర్వేల్ని బ్యాన్ చేయాలన్నది ఆమె డిమాండ్. ఎందుకిలా? అని ప్రశ్నిస్తే ఆమె ఉదాహరణతో సహా తన వాదనలోని సహేతుకతను చూపిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమతా బెనర్జీ పార్టీ వెనుకంజలో ఉన్నట్లు చూపితే.. అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. అధికారం కోసం తపించిన వారి కలలు చెదిరిపోయాయి. అందుకే ఈ సర్వేల ద్వారా ఓటర్లు తప్పుదారి పట్టొద్దన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకుంటుందని.. అధికారాన్నినిలుపుకుంటుందని ఒక స్థానిక న్యూస్ చానల్ కథనాన్ని ప్రసారం చేసిన నేపథ్యంలో ఆమె నోటి నుంచి ఈ డిమాండ్ వచ్చింది. ఎన్నికల కమిషన్ ముందుకు తన డిమాండ్ ను తీసుకెళతానన్న మాయావతి.. తన తాజా డిమాండ్ అమలు చేయించే విషయంలో ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.