Begin typing your search above and press return to search.
ఏపీ రాజధానికి కొత్త బొమ్మలు వచ్చేశాయ్
By: Tupaki Desk | 5 Jun 2016 6:32 AM GMTరాష్ట్ర విభజన సంగతేమో కానీ.. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఇప్పుడంతా కొత్త గోలే. ఏపీకి రాజధాని లేని నేపథ్యంలో కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించిన కొత్త నిర్మాణాలకు సంబంధించిన యానిమేషన్ చిత్రాల్నసిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని నగరం అమరావతిలోని 900 ఎకరాల్లో నిర్మించనున్న ఏపీ ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి ఆ మధ్యన జపాన్ కు చెందిన మాకీ అండ్ అసోసియేట్స్ కొన్ని ఆకృతుల్ని ఇచ్చింది. వీటిల్లో కొన్ని భవనాల నమూనాలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు.. కూలింగ్ టవర్లను పోలి ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి.
దీంతో.. వీటిస్థానే కొత్త డిజైన్ల కోసం పోటీ నిర్వహించారు. ఇందులో భాగంగా తాజాగా ఏడు ప్రముఖ భవన నిర్మాణ శిల్పులు తాము తయారు చేసిన కొత్త డిజైన్లను ఏపీ సర్కారుకు అందచేశారు. తాజాగా ఇచ్చిన కొత్త డిజైన్లు అత్యాధునికంగా ఉండటంతో పాటు.. మోడ్రన్ గా ఉండటం గమనార్హం. మాకీ సంస్థ డిజైన్లలో పచ్చదనం కొట్టొచ్చినట్లుగా కనిపించటంతో పాటు.. శ్వేతవర్ణంలో ఉండేలా భవనాల్ని డిజైన్ చేశారు. తాజాగా వచ్చిన కొత్త డిజైన్లు మాత్రం స్టార్ వార్ సినిమాల్లో సెట్టింగుల మాదిరి ఉండటం గమనార్హం. అత్యాధునికంగా ఉన్నట్లుగా ఉన్న ఈ నిర్మాణాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.