Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కి కొత్త కష్టం- హైకమాండ్ కు పైలెట్ వార్నింగ్ ?
By: Tupaki Desk | 29 April 2022 6:35 AM GMTరాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం తప్పేట్లు లేదు. ఉదయ్ పూర్లో మే 13-15వ తేదీ మధ్య చింతన్ భైటక్ పై దీని ప్రభావం పడబోతోంది. దాంతో పార్టీ హైకమాండ్ నుండి అన్నీ స్థాయి నేతల్లోను టెన్షన్ మొదలైపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే రాజస్ధాన్ ముఖ్యమంత్రిగా తనను వెంటనే నియమించాలని సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి సచిన్ పైలెట్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.
తనను వెంటనే సీఎం కుర్చీలో కూర్చోబెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవటం కల్లే అని స్పష్టంగా చెప్పేశారట. రాజస్ధాన్ వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. పనిలోపనిగా మొత్తం పార్టీని ఎలా పునరుజ్జీవింపచేయాలనే విషయంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి రాహుల్, ప్రియాంక తో కలిసి అనేకమంది సీనియర్లు తలలు బాదుకుంటున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీలు కూడా ఇందులో భాగమే.
ఒకవైపు పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అర్థం కాక నానా అవస్థలు పడుతుంటే హఠాత్తుగా పైలెట్ వార్నింగ్ వచ్చిపడింది. సోనియా, రాహుల్, ప్రియాంకలతో పైలెట్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారట. పైలట్ వాలకం చూస్తుంటే తన వర్గం ఎంఎల్ఏలతో కలిసి కాంగ్రెస్ ను వదిలేసినా ఆశ్చర్యపోక్కర్లేదు.
ఎందుకంటే తనవర్గం ఎంఎల్ఏలతో పార్టీని వదిలేసేందుకు పైలెట్ ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నం చేశారు. అధిష్టానం బుజ్జగిచటంతో ఆగినా సీఎం అశోక్ గెహ్లోత్ తో ఏమాత్రం పడటం లేదు.
నిజానికి రాజస్ధాన్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి పైలెట్ట్ ఎక్కువ కారణం. గెహ్లోత్ కన్నా పైలెట్ పార్టీకోసం ఎక్కువ కష్టపడ్డారు. కాకపోతే పార్టీకి మెజారిటీ సీట్లు రాగానే అధిష్టానం దగ్గరున్న పట్టు కారణంగా పైలెట్ ను కాదని గెహ్లోత్ వెంటనే సీఎం కుర్చీలో కూర్చునేశారు.
అప్పటినుండి వీళ్ళద్దరికీ పడటం లేదు. పార్టీలోకి యువరక్తం రావాలంటారు, పార్టీలో యువత యాక్టివ్ గా ఉండాలంటారు కానీ పదవులన్నీ మళ్ళీ 70 ఏళ్ళు దాటిన వాళ్ళే తీసుకుంటారు. గెహ్లోత్ కూడా గతంలో సీఎం చేసిన వ్యక్తే. కానీ ఎన్నిసార్లయినా తానే సీఎంగా ఉండాలనుకుంటున్నారే కానీ యువతకు అవకాశం ఇవ్వాలని మాత్రం అనుకోవటం లేదు. ఇలాంటి వాళ్ళకే సోనియా కూడా మద్దతిస్తున్నారు కాబట్టే పార్టీ అథోగతిలో పడిపోయింది.