Begin typing your search above and press return to search.
వెహికిల్ నెంబర్ ప్లేట్లు మారనున్నాయా?
By: Tupaki Desk | 24 Aug 2016 5:52 AM GMTకొత్త జిల్లాల ఏర్పాటేమో కానీ.. చాలానే మార్పులు జరగాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకూ తెర మీదకు వచ్చిన అంశాలు కొన్నే అని.. తెర మీదకు రావాల్సిన అంశాలు చాలానే ఉంటాయన్న మాటను సీనియర్ అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల కారణంగా ప్రజలు సైతం పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. కొత్త జిల్లాల కారణంగా జిల్లా కేంద్రాలు.. ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి కొందరు లాభపడితే.. మరికొందరికి కష్టాలు తప్పవన్న మాట వినిపిస్తోంది.
అయితే.. దీని ప్రభావం ఎంతన్నది ఇప్పటికిప్పుడు స్పష్టంగా అవగాహన లేనప్పటికీ.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాక్టికల్ గా కొన్ని కొత్త సమస్యలు తలెత్తటం పక్కా అన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. కొత్త జిల్లాలతో వాహనాల నెంబరు ప్లేట్లు మారతాయా? అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ పది జిల్లాలుగా ఉన్న తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు కేటాయించే విధానం ఒకటి అమల్లో ఉంది. తాజాగా పది జిల్లాలు కాస్తా 27 జిల్లాలు మారనున్న నేపథ్యంలో.. ఏ జిల్లాకు ఏ నెంబరు ఇవ్వాలి? ఏ సీరిస్ ను ఇవ్వాలి? జిల్లా కోడ్ నంబర్లకు ఏ ప్రాతిపదికన కేటాయించాలి? లాంటి కీలక ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా.. జిల్లా పేర్ల మొదటి అక్షరం ఆధారంగా కొత్త నెంబర్లు కేటాయించాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. ఇప్పటికే అమల్లో ఉన్న నెంబర్లు దాదాపుగా మారిపోయే వీలుందని చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల రద్దీ ఎక్కువ.. మరికొన్ని జిల్లాల్లో తక్కువ ఉన్న నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండే జిల్లాల విషయంలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న అంశంపై చర్చ జరగాల్సి ఉందన్న భావన వ్యక్తమవుతోంది.
వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్ల విషయంలో రానున్న రెండు వారాల వ్యవధిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్న వాదన వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. ఇప్పటికున్న నెంబర్లు కాకుండా.. కొత్త జిల్లాలకు తగ్గట్లు కొత్త నెంబర్లు దసరా నుంచి తెర మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సో.. వాహన నెంబర్లు చూసి.. ఆ వాహనం ఏ జిల్లాదన్న విషయం దసరా తర్వాత చెప్పటం కాస్త కష్టమే అవుతుందన్న మాట.