Begin typing your search above and press return to search.
25 కాదు..30 కానే కాదు ఇప్పుడైతే 26 అంట
By: Tupaki Desk | 19 Jun 2016 7:16 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్న సంగతి తెలిసిందే. దసరా నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కావాలన్న లక్ష్యంతో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కొత్త జిల్లాలకు సంబంధించి భారీ కసరత్తునే చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 10జిల్లాలకు అదనంగా 15 ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు రాగా.. అలాంటిదేమీ లేదు మరో 20 కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న వార్తలు వచ్చాయి. తాజాగా కొత్త జిల్లాల మీద ఒక క్లారిటీ రావటంతో పాటు.. తాము నిర్ణయించిన ముసాయిదాను కలెక్టర్లు నివేదిక సిద్ధం చేశారు.
తాజాగా చెబుతున్న దాని ప్రకారం కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలుగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా మండలాల్ని పునర్ వ్యవస్థీకరించటంతో పాటు.. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని గ్రామసభల ద్వారా అభిప్రాయసేకరణ చేపట్టారు. అదే సమయంలో కొత్త జిల్లాల మీద ఉన్న డిమాండ్లను పరిశీలించి.. సాధ్యాసాధ్యాల మీద కసరత్తు చేసి తుదిగా 26 జిల్లాలతో కూడిన ప్రపోజల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగా లేదని (నలత ఉందని చెబుతున్నారు) అందుకే కొత్త జిల్లాలకు సంబంధించిన ఫైలు మీద సీఎం దృష్టి సారించలేదని తెలుస్తోంది. తాము ప్రతిపాదించిన కొత్త జిల్లాలు దాదాపుగా మారకపోవచ్చని.. ముఖ్యమంత్రి కానీ ఏవైనా మార్చాలనుకుంటే మార్పులు ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాలకు సంబంధించి తాజాగా సిద్ధం చేసిన ప్రతిపాదనను చూస్తే..
26 జిల్లాలు ఏవంటే..
ప్రస్తుతం ఉన్నవి కొత్తగా వచ్చేవి
అదిలాబాద్ 1.అదిలాబాద్ 2. మంచిర్యాల
నిజామాబాద్ 1.నిజామాబాద్ 2 కామారెడ్డి
కరీంనగర్ 1.కరీంనగర్ 2.జగిత్యాల 3. సిరిసిల్ల
మెదక్ 1.మెదక్ 2. సంగారెడ్డి 3.సిద్దిపేట
రంగారెడ్డి 1.వికారాబాద్ 2. ఉత్తర రంగారెడ్డి 3. దక్షిణ రంగారెడ్డి
హైదరాబాద్ 1.హైదరాబాద్ 2. సికింద్రాబాద్
మహబూబ్ నగర్ 1.మహబూబ్ నగర్ 2. నాగర్ కర్నూలు 3. వనపర్తి
వరంగల్ 1.వరంగల్ 2.మహబూబాబాద్ 3. భూపాలపల్లి
నల్గొండ 1.నల్గొండ 2. సూర్యాపేట 3.యాదాద్రి
ఖమ్మం 1.ఖమ్మం 2. భద్రాద్రి (కొత్తగూడెం)