Begin typing your search above and press return to search.
కొత్త జిల్లాల మాట చట్టంగా ఎలా అవుతుందంటే..
By: Tupaki Desk | 6 Oct 2016 5:16 AM GMTకొత్త జిల్లాలకు సంబంధించిన కసరత్తు కొద్ది నెలలుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికి పలు మార్పులు చేర్పులు చోటు చేసుకోవటం.. ఎక్కడో మొదలై మరెక్కడో ఆగటం తెలిసిందే. కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికి.. ఇప్పటికి ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగా జిల్లాల సంఖ్యలో చాలానే మార్పు చోటు చేసుకోవటం తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటు మొత్తం పూర్తి అయిపోయిందని.. 17 కొత్త జిల్లాలతో మొత్తంగా 27 జిల్లాలుగా తెలంగాణ రాష్ట్రం ఉండనుందన్న అభిప్రాయం బలంగా నాటుకున్న వేళ.. నాటకీయంగా మరో నాలుగు కొత్త జిల్లాలు తెర మీదకు వచ్చిన ముచ్చట తెలిసిందే.
మొదటి నుంచి అనుకుంటున్నట్లుగా కొత్త జిల్లాల్ని దసరా రోజు నుంచి షురూ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. దసరాకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండటం.. ఇప్పటికి జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ డివిజన్లు.. మండలాల విషయంలో స్పష్టత లేని నేపథ్యంలో.. వాటి ఏర్పాటు దానికి తగ్గట్లుగా మ్యాప్ లు సిద్ధం చేసుకోవటం.. పాలనా విభాగాల్ని సమాయుత్తం చేయటం.. ఇలా ఒకటేమిటి? చాలానే పని ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకూ మాటల్లో అనుకుంటున్న కొత్త జిల్లాలు చట్టబద్ధంగా ఎలా ఏర్పాటు కానున్నాయి? దానికి మరెంత కసరత్తు మిగిలి ఉందన్నది ఆసక్తికర వ్యవహారమే. అదే విషయాన్ని చూస్తే.. రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ సర్కారు పూర్తి చేయాల్సిన పనులెన్ని ఉన్నాయన్నది ఇట్టే తెలుస్తుంది. కొత్త జిల్లాలకు సంబంధించి తుది రూపును సిద్ధం చేసేందుకు సీనియర్ నేత కేకే నేతృత్వంలో ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ ఈ రాత్రి (గురువారం) తన తుది నివేదికను ఇవ్వనుంది. ఈ నివేదిక కొత్త జిల్లాల ఏర్పాటుకు అత్యంత కీలకంగా చెప్పాలి.
ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి దాన్ని ఓకే చేసేస్తే.. కొత్త జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ డివిజన్లు.. మండలాల లెక్క ఫైనల్ అయినట్లే. అనంతరం జిల్లాల స్వరూపం.. పోస్టులు.. ఉద్యోగ నియామకాలు లాంటి పనులపై స్పష్టత వచ్చే వీలుంది. అనంతరం.. హైపర్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోద ముద్ర వేయటం ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కీలక ప్రక్రియ పూర్తి కానుంది.
మంత్రివర్గ నిర్ణయం పూర్తి అయిన తర్వాత.. దానికి సంబంధించిన అధికారిక ప్రకటనను జీవో రూపంలో జారీ చేస్తారు. ఓ పక్క ఈ పని జరుగుతుండానే.. మరోపక్క.. కేకే ఇచ్చే నివేదిక ఆధారంగా అధికారులు జిల్లాలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/