Begin typing your search above and press return to search.

జిల్లాల ఏర్పాటు... ప్ర‌జాభీష్ట‌మా? పొలిటిక‌ల్ అభీష్ట‌మా?!

By:  Tupaki Desk   |   26 Jan 2022 11:03 AM GMT
జిల్లాల ఏర్పాటు... ప్ర‌జాభీష్ట‌మా?  పొలిటిక‌ల్ అభీష్ట‌మా?!
X
రాష్ట్రంలో పరిపాలనా సౌల‌భ్యం కోసం ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను అసెంబ్లీ నియోక‌జ‌వ‌ర్గాల ప్రాతిప‌దిక గా.. 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ.. ప్ర‌భుత్వం గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. కొత్త రెవెన్యూ డివిజ‌న్ల ను కూడా ఏర్పాటు చేయ‌నుంది. ఈ మేరకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఉగాది పండుగ నాటికి జిల్లాల‌ను ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ప్ర‌జ‌లు త‌మ‌ అభిప్రాయాలు తెలిపేందుకు నోటిఫికేష‌న్ విడుద‌లైన నాటి నుంచి 30 రోజుల స‌మ‌యం ఇచ్చారు. జిల్లాల ఏర్పాటుపై అభ్యంత‌రాల‌ను ఆయా జిల్లాల ప‌రిధిలోని క‌లెక్ట‌ర్ల‌కు తెలుగు లేదా ఇంగ్లీషుల్లో తెలియ‌జేయాల ని పేర్కొన్నారు.

జిల్లాల ఏర్పాటులో ఆయా ప్రాంతాల ప్ర‌జ‌ల అభీష్టానికి పెద్ద‌పీట వేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. అయి తే.. ఇక్క‌డ ప్ర‌జ‌ల ఇష్టం కొంత ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రికొంత పొలిటిక‌ల్ అభీష్టం కూడా క‌నిపిస్తోంద‌ని తెలు స్తోంది. ప్ర‌ధానంగా టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు.. జిల్లాల్లో మార్పులు భారీగా చోటు చేసుకున్నా యి. ఉదాహ‌ర‌ణ‌కు ప‌శ్చిమ గోదావ‌రిజిల్లా, నెల్లూరు, కృష్నాజిల్లాల్లో మార్పులు పార్టీకి కొంత ఇబ్బంది అనే మాట వినిపిస్తోంది. అదేవిధంగా ప్ర‌కాశం జిల్లా సంతనూతలపాడు శాసనసభ స్థానం ఒంగోలు నగరానికి సమీపంలో ఉంటుంది. కాబట్టి సంతనూతలపాడుని కొత్తగా ఏర్పాటయ్యే బాపట్ల జిల్లాకు బదులు, ఒంగోలు జిల్లాలో చేర్చారు. దీనివల్ల ఓటు బ్యాంకు మారుతుంది.

ఇదేస‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం రెండు జిల్లాల‌ప‌రిధిలో కూడా ఉంది. దీనివ‌ల్ల అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌నేది నిజ‌మే. ఎందుకంటే..ఇద్ద‌రు క‌లెక్ట‌ర్ల‌తో ప‌నులు చేయించాల్సి వ‌స్తోంది. ఇది ఇబ్బందిగానే ఉంది. దీంతో ఇలాంటి వాటిలో కొంత మార్పు తీసుకురావ‌డం ఆహ్వానించ ద‌గిన‌దే అయితే.. టీడీపీకి బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో విభ‌జ‌న మాత్రం కొంత మేర‌కు పొలిటిక‌ల్‌గా ప్ర‌భావం చూపుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా పరిధిలోకి తెచ్చారు. ఇది పెద్ద‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశం లేదు. ఎందుకంటే.. ఇది ఇప్ప‌టికేనెల్లూరు జిల్లాలో ఉంది.

ఇక‌, అర‌కును రెండు జిల్లాలు చేశారు. విశాఖ‌ను విడ‌గొట్టి.. గిరిజ‌నుల కోసం అంటూ.. మ‌న్యం జిల్లాను ఏర్పాటు చేశారు. ఇది బాగానే ఉన్నా.. జిల్లాల‌కు ఎన్టీఆర్ పేరు, అల్లూరి పేరు పెట్ట‌డం ద్వారా.. ఆయా వ‌ర్గాలను పార్టీవైపు మ‌ళ్లించుకునే వ్యూహం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో కొన్ని జిల్లాల‌కు ఆధ్యాత్మిక పేర్లు పెట్టారు. అన్న‌మ‌య్య‌, బాలాజీ వంటి పేర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. కొంత ప్ర‌జాభీష్టం క‌నిపిస్తున్నా.. మ‌రికొంత పొలిటిక‌ల్ వ్యూహంతోనే ఈ కూర్పు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.