Begin typing your search above and press return to search.

చంద్రబాబు టూర్ తో ఇపుడు కొత్త డౌట్లు

By:  Tupaki Desk   |   31 Oct 2021 11:30 AM GMT
చంద్రబాబు టూర్ తో ఇపుడు కొత్త డౌట్లు
X
ఇప్పుడు తమ్ముళ్ళ చూపంతా కుప్పం మీదే కేంద్రీకృతమైంది. ఎందుకంటే తొందరలోనే కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక జరగబోతోంది. ఆ ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో చంద్రబాబునాయుడు మూడు రోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నారు. గడచిన 30 ఏళ్ళుగా కుప్పంలో చంద్రబాబుకు తగలని ఎదురుదెబ్బలు ఒక్కసారిగా షాకునిచ్చాయి. ఈ మధ్యలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పంచాయితీలో టీడీపీ మద్దతుదారులు ఓడిపోయారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది.

నియోజకవర్గంలోని నాలుగు జడ్పీటీసీలనూ వైసీపీనే గెలుచుకుంది. అలాగే 66 ఎంపీటీసీల్లో 63 స్ధానాలు వైసీపీనే గెలుచుకుంది. దాంతో నియోజకవర్గంలో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత ఏమిటో బయటపడింది. దాంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైపోయింది. దాంతో తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలో గెలవకపోతే ఇబ్బంది తప్పదని గ్రహించారు. దాంతో వెంటనే కుప్పం టూర్ పెట్టుకున్నారు. చంద్రబాబు రోడ్డు షో ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతం అయ్యింది. పోలీసుల ఆంక్షలున్నా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.

జనంలో వచ్చిన స్పందన చూసి మరింత ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు సవాళ్లు విసిరారు. అయితే, ఇంతవరకు బాగానే ఉంది. కుప్పం మున్సిపాలిటిలో 25 కి 25 వార్డుల్లో టీడీపీని గెలిపించి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు చెబుతున్నారు. అంది సాధ్యమేనా?

స్థానిక ఎన్నికలు ప్రలోభాలతోనే జరుగతాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేది ఇదే. కాబట్టి చంద్రబాబు పర్యటనలో తాజాగా జన స్పందన చూసిన తర్వాత రేపటి మున్సిపల్ ఎన్నికలో టీడీపీ గెలుపుపై అంచనాలు పెరుగుతున్నాయి. నిజంగానే టీడీపీ గనుక గెలిస్తే జగన్ పరువు ఏమైపోతుంది ? లేదా జగన్ గెలిస్తే టీడీపీకి వచ్చిన జన స్పందనను ఎలా అర్థం చేసుకోవాలి?