Begin typing your search above and press return to search.

కేసీఆర్ బహిరంగ సభపై కొత్త సందేహాలు? జరిగేనా?

By:  Tupaki Desk   |   12 April 2021 1:42 PM GMT
కేసీఆర్ బహిరంగ సభపై కొత్త సందేహాలు? జరిగేనా?
X
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి.. ప్రజాస్వామ్యం గొప్పతనమే వేరుంటుంది. చేతిలో రేంజ్ రోవర్ ఉన్ననప్పటికి.. దాన్ని నడిపేటోడు సరైనోడు కాకుంటే ప్రయోజనం ఉంటుంది. పోటుగాడు లాంటి వాడి చేతిలో పాత అంబాసిడర్ ఉన్నా.. రోడ్డు మీద పంచ కల్యాణిని తలపించేలా నడిపిస్తుంటాడు. అలానే ప్రజాస్వామ్య వ్యవస్థను సరిగా అర్థం చేసుకొని.. దాన్ని వాడే విధంగా వాడేలే కానీ.. పవర్ చేతిలో ఉన్నోడ్ని సైతం ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. ఇదంతా ఎందుకంటే.. ఈ నెల పద్నాలుగున అంటే మరో మూడు రోజుల్లో సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియాలో లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు సీఎం కేసీఆర్.

కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్న ఇప్పటి పరిస్థితుల్లో లక్ష మందితో భారీ బహిరంగ సభా? అన్న సందేహం అక్కర్లేదు. సారు అనుకున్న తర్వాత దేనికైనా సై అన్నట్లు సర్కారు సిద్ధమైంది. కానీ.. వ్యవస్థలు కొన్ని ఉంటాయిగా. నిబంధనల్ని తూచా తప్పకుండా ఫాలో కావటానికి. తాజాగా పలువురు రైతులు సీఎం బహిరంగసభను నిర్వహించే విషయంపై తమకున్న అభ్యంతరాలతో హైకోర్టును ఆశ్రయించారు.

కోవిడ్ నిబంధనల ప్రకారం లక్ష మందితో సభ పెట్టటానికి వీల్లేదని.. కోవిడ్ పేరుతో పండుగల్నినిర్వహించుకోవద్దని చెప్పే ప్రభుత్వం.. లక్ష మందితో సభను ఎలా నిర్వహిస్తారని పిటిషన్ లో రైతులు పేర్కొన్నారు. అంతేకాదు.. సభను తమ భూముల్లో పెడుతున్నారని రైతులు తమ అభ్యంతరాల్ని ఏకరువు పెడుతూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న కేసుల తీవ్రత నేపథ్యంలో.. ప్రజారోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని సభను రద్దు చేయాలని కోరారు.
రైతుల తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను యుగ తులసి.. గోసేన ఫౌండేషన్స్ రంగంలోకి దిగాయి. ఓపక్క రైతులు హైూకోర్టును.. మరోవైపు ఎన్జీవోలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో భారీగా చేపట్టాలనుకున్న బహిరంగ సభ ఇప్పుడు సందేహంగా మారింది. బంతి హైకోర్టులో ఉంది. మరి.. న్యాయమూర్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏమైనా.. రైతుల నిర్ణయంతో కేసీఆర్ కు ఊహించని షాక్ ఎదురైందని చెప్పక తప్పదు.