Begin typing your search above and press return to search.

ఏ ఫీలింగ్ అయినా ఎఫ్‌ బీలో చెప్పేయొచ్చు!

By:  Tupaki Desk   |   28 Jan 2016 7:30 PM GMT
ఏ ఫీలింగ్ అయినా ఎఫ్‌ బీలో చెప్పేయొచ్చు!
X
గ‌డిచిన వందేళ్ల కాలంలో ప్ర‌పంచంలోని ప్ర‌జ‌ల్ని అమితంగా ప్ర‌భావితం చేసిన అంశాల‌కు సంబంధించిన‌ జాబితా సిద్ధం చేస్తే అందులో ఫేస్ బుక్ కు అగ్ర‌స్థానం ల‌భించ‌క మాన‌దు. నిద్ర లేచింది మొద‌లు నిద్ర పోయే వ‌ర‌కూ.. ఏ ప‌నిలో ఉన్నా ఎఫ్‌ బీ అప్ డేట్స్ చూసుకునే వారు.. దాంతో ఎంగేజ్ అయ్యేవారు చాలామందే క‌నిపిస్తారు.

అంత‌లా ప్ర‌జ‌ల జీవితాల్లోమ‌మేక‌మైన ఫేస్ బుక్ ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా.. మ‌రిన్ని స‌దుపాయాలు క‌ల్పించే దిశ‌గా అడుగులు వేయ‌టం..కొత్త కొత్త ఫీచ‌ర్లు అందుబాటులోకి తీసుకురావ‌టం ఎఫ్‌ బీకి మామూలే. తాజాగా ఇప్పుడున్న లైక్‌.. కామెంట్‌.. షేర్ బ‌ట‌న్ల‌తో పాటు మ‌రిన్ని భావోద్వేగాల్ని పంచుకునే అవ‌కాశాన్ని ఫేస్ బుక్ త్వ‌ర‌లో క‌ల్పించ‌నుంది. ఇందుకోసం ఆరు కొత్త ఎమోష‌న్స్ ను ఫేస్ బుక్ సిద్ధం చేసింది. వాస్త‌వానికి ఈ ఆరు ఎమోష‌న్స్ ను ఇప్ప‌టికే చిలీ.. ఫిలిప్పీన్స్‌.. పోర్చుగ‌ల్.. ఐర్లాండ్‌.. స్పెయిన్‌.. జ‌పాన్‌.. కొలంబియాల‌లో ప‌రీక్షిస్తున్నారు. ఈ టెస్టింగ్ స‌క్సెస్‌ ఫుల్ కావ‌టంతో త్వ‌ర‌లో అంద‌రికి అందుబాటులోకి తెచ్చే అంశంపై ఎఫ్‌ బీ సీరియ‌స్‌ గా దృష్టి సారిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కొత్త‌గా వ‌చ్చే 6 ఎమోష‌న్స్ చూస్తే..

1. కోపాన్ని తెలిపేందుకు (angry)
2. బాధ‌ను చెప్పేందుకు (sad)
3. సంతోషాన్ని తెలియ‌జేసేందుకు (ha ha)
4. ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసేందుకు (wow)
5. ప్రేమ‌గా రియాక్ట్ కావాలంటే (love)
6. స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించాలంటే (yay)