Begin typing your search above and press return to search.
తాజా ఫేస్ బుక్ ఉద్యమం.. ఆ భర్తలకు చుక్కలు చూపిస్తోందట
By: Tupaki Desk | 23 Aug 2019 5:30 PM GMTపని ప్రదేశంలో అవకాశాల కోసం కానీ ఇతరత్రా అంశాలతో మహిళలపై జరిపే లైంగిక వేధింపులపై నినదించిన గళం మీటూ. సినీ పరిశ్రమలో మొదలైన ఈ ఉద్యమం అన్ని రంగాల్లోనూ పెను విప్లవాన్ని తీసుకురావటమే కాదు.. మహిళల్లో ధైర్యాన్ని.. తమకు జరిగిన అన్యాయం గురించి గళం విప్పేందుకు అవకాశం ఇచ్చింది. అదే.. సమయంలో దీన్ని మిస్ యూజ్ చేసిన వైనాన్ని ప్రస్తావించకుండా ఉండలేం. అయితే.. ఈ ఉద్యమం పుణ్యమా అని మహిళల్లో చైతన్యాన్ని పెంపొందిచటమే కాదు.. దైర్యాన్ని పెంచటంలోనూ కీలకభూమిక పోషించింది.
మీటూ మాదిరే బ్రిటన్ లో మరో కొత్త తరహా ఉద్యమం మొదలైంది. ఫేస్ బుక్ వేదికగా చేసుకొని స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఇప్పుడు స్వల్ప వ్యవధిలోనే అంతకంతకూ విస్తరించుకుంటూ పోతోంది. మాజీ భర్తలు తమను ఎంతలా వేధించారో.. మరెంతలా కష్టపెట్టార్న విషయాలతో పాటు.. శారీరకంగానూ.. మానసికంగానూ తమను హింసించిన వైనాల్ని చెప్పుకోవటమే తాజా ఉద్యమం. దీనికి ప్రిక్ అడ్వైజర్ అన్న పేరును పెట్టారు.
ఈ ఉద్యమంలో భాగంగా తమ ఇష్టం లేకున్నా తమపై శారీరక హింసకు గురి చేయటం.. రేప్ లు చేయటం.. మోసం చేయటం.. పరాయి మహిళలతో గడపటం లాంటి ఎన్నో విషయాల మీద బాధితులు ఫోటోలతో సహా పోస్టులు పెడుతున్నారు. తమ మాజీ భాగస్వాముల గుట్లను రట్టు చేయటమే కాదు.. వారి వివరాలు.. ఫోటోల్ని తెర మీదకు తేవటం సంచలనంగా మారింది.
బ్రిటన్ లో ఒక చట్టం ఉంది. దీని ప్రకారం గతంలో పెళ్లి చేసుకొని భార్యకు విడాకులు ఇచ్చిన మగవాళ్లకు సంబంధించి ఏదైనా నేరచరిత ఉందా? గృహ హింసకు సంబంధించిన రికార్డు ఏమైనా ఉందా? అన్నది తెలుసుకోవటం కోసం.. వారిని మళ్లీ పెళ్లాడుతున్న మహిళలకు తాము వివాహం చేసుకోనున్న వ్యక్తి ఎలాంటి వాడన్న విషయంపై అవగాహన కోసం క్లేర్స్ లా అనే చట్టాన్ని రూపొందించారు. అయితే.. ఈ చట్టం అమలు సరిగా లేదన్నది ఆరోపణ.
ఎందుకంటే మాజీ భర్తల సమాచారాన్ని అందించాల్సిన పోలీసులు సరిగా అందించటం లేదన్న మాట వినిపిస్తోంది. దీంతో.. మాజీ భర్తల్ని పెళ్లాడే మహిళలకు సమాచారం అందని పరిస్థితి. బ్రిటన్ లో ఏటా 13 లక్షల మంది మహిళలు భర్తల చేతుల్లో లైంగిక వేధింపులు.. గృహ హింస కారణంగా విడిపోతుంటే.. వారిలో కేవలం 18 శాతం మంది మాత్రమే పోలీసుల వద్దకు వెళ్లి కంప్లైంట్స్ చేస్తున్నారు. కేసులు చేస్తున్నారు. దీంతో.. సదరు భర్తలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటోంది. మిగిలిన సమాచారం ఉండని పరిస్థితి.
ఈ నేపథ్యంలో మాజీ భర్తల దుర్మార్గాలు.. దాష్టీకాలతో పాటు.. వారి మనస్తత్వాన్ని తెలిపేలా తాజాగా ఫేస్ బుక్ లో ప్రిక్ అడ్వైజర్ గ్రూప్ ఒకటి స్టార్ట్ అయ్యింది. ఇందులో భర్తతో విడిపోయిన భార్యలు తమ చేదు అనుభవాల్ని వివరిస్తారు. ఇప్పుడీ ఉదంతం సంచలనంగా మారింది. కానీ.. సమస్య ఏమంటే.. నాణెనికి బొమ్మతో పాటు బొరుసు ఉన్నట్లే.. దుర్మార్గులకు గురించి సమాచారం ఇచ్చే మహిళలతో పాటు.. కొందరు అమాయకపు భర్తల గురించి కిలేడీలు కొందరు టార్గెట్ చేసినట్లుగా వ్యవహరించటంతో మగాళ్లు ఇప్పుడు హడలిపోతున్నారట. మాజీ భర్తలకు చెమటలు పట్టిస్తున్న తాజా ఉద్యమం ఉద్దేశం మంచిదే అయినా.. అది పక్కదారి పట్టకుండా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. మన దేశంలో ఈ ఉద్యమం కానీ మొదలైతే.. మరెన్ని సమస్యలు తలెత్తుతాయో?