Begin typing your search above and press return to search.
శ్రీకాకుళం తెరపైకి కొత్త ముఖాలు?
By: Tupaki Desk | 17 Jun 2022 4:30 PM GMTశ్రీకాకుళం రాజకీయాల్లో అంతర్గత పోరు తీవ్రతరం అవుతోంది. త్వరలో అచ్చెన్నపై ఫిర్యాదు చేసేందుకు కూడా ఇక్కడి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అలియాస్ లక్ష్మమ్మ ప్రయత్నిస్తున్నారు అని కూడా తెలుస్తోంద. ఏదేమయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో కూడా తామే ఇక్కడి నుంచి పోటీ చేస్తామని, కొత్త వారికి అవకాశాలు ఇచ్చేందుకు వీల్లేదన్న ధోరణిలో గుండ కుటుంబం ఉందన్న వాదన స్వపక్షంలోనే వినిపిస్తోంది.
నిత్య అసంతృప్త వాదం ప్రస్తుతానికి లేకపోయినా ఎన్నాళ్ల నుంచో ఈ కుటుంబాన్ని నమ్ముకున్న వారంతా పదవులు లేక గుర్తింపు లేక అవస్థ పడుతున్నారు అన్నది మాత్రం నిజం అని సొంత పార్టీ మనుషులే బాహాటంగా ఒప్పుకుంటున్నారు. గుండ లక్ష్మమ్మ వ్యవహార శైలిపై ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. గార మండలంలో పట్టున్న నాయకులు అంతా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం.
ఈ తరుణాన ఇప్పటిదాకా ఓ లెక్క ఇకపై ఓ లెక్క అన్న విధంగా శ్రీకాకుళం రాజకీయం ఉండనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గంకు సంబంధించి వర్గ పోరు విపరీతంగా ఉంది. ఒకప్పుడు గుండ కుటుంబానికి ఎదురు అన్నదే లేదు అన్నవిధంగా ఉండేదా రాజకీయం. కానీ ఇప్పుడు కాస్త మారింది. ఈ మార్పు కూడా మంచిదే అన్నవిధంగానే ఉంది అన్నది ఓ వర్గం మాట ! ఇప్పటిదాకా వరుస కొన్నేళ్ల పాటు పదవులు అందుకున్న గుండ కుటుంబానికి చెక్ పెట్టేందుకు ముగ్గురు ప్రయత్నిస్తున్నారు అని తెలుస్తోంది.
గతంలో అంటే చంద్రబాబు హయాంలో గుండ కుటుంబానికి మంచి వాల్యూ ఉండేది. ఆ కారణంగానే నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనులు కూడా వాళ్లు చేయించుకున్నారు కూడా ! కానీ అనుచరులకు పెద్దగా ఆ రోజు అనగా అధికారంలో ఉన్న రోజు ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శలూ ఉన్నాయి.ఈ క్రమంలో కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ఒకటి కింజరాపు ఎర్రన్నాయుడు అనుచరుడు నాగావళి కృష్ణ కాగా మరొకరు గుండ కుటుంబానికి చెందిన ప్రధాన అనుచరుడు గొండు శంకర్.
వీళ్లిద్దరూ కాకుండా ఎంపీ రామూకు చెందిన మరొకరు కూడా టికెట్ ఆశిస్తున్నారు.ఆయనే కొర్ను ప్రతాప్. ఈయన గతంలో పీఆర్పీలో పనిచేశారు. గుండ లక్ష్మీదేవి (2014లో ఇక్కడి ఎమ్మెల్యే) భర్త గుండ అప్పల సూర్యనారాయణపై 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇంకొందరు కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే పార్టీలో ఉన్న విభేదాలన పరిష్కరించడంలో అచ్చెన్నసైతం పెద్దగా దృష్టి సారించడం లేదు.
మరోవైపు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కూన రవి కూడా పెద్దగా ఇటుగా రావడంలేదు. వివాదాల పరిష్కారంపై దృష్టి సారించడం లేదు. తాజాగావినిపిస్తున్న సమాచారం ప్రకారం గుండ దంపతుల చిన్న కుమారుడు (ప్రస్తుతం ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉంటున్నారు) గుండ విశ్వనాథం సిన్లోకి వస్తారని తెలుస్తోంది. ఇంకొకవైపు ధర్మాన కుటుంబంకు గుండ కుటుంబానికి మంచి అనుబంధం ఉన్న రీత్యా కొత్త ముఖాలు ఏవి వచ్చినా అవేవీ రాణించవు అని కూడా ఓ మాట వినిపిస్తోంది.