Begin typing your search above and press return to search.
కొత్త ఎత్తు : వైసీపీలోకి వారసులొస్తున్నారు ...?
By: Tupaki Desk | 21 July 2022 2:30 AM GMTరాజకీయాల్లో వారసుడు ఉండాల్సిందే. ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. పుడితే కొడుకే పుట్టాలి. వాడే నా వారసుడు అని చెప్పాలి ఇదీ నేతల ఆరాటం. నయా రాజనీతిలో కూతుళ్ళు కూడా వారసత్వం తీసుకుంటున్నారు. మొత్తానికి పవర్ మన ఇంటి గుమ్మం దాటకూడదు అంతే. ఇదే రాజకీయ నేతల పంతం. శపధం. ఇదిలా ఉంటే తెలుగుదేశంలో కొత్త నీరు అంటున్నారు. యువతకు చాన్స్ అంటున్నారు. అదంతా కూడా వారసుల కోసమే అన్న మాట వినిపిస్తోంది.
ఆరు పదులు దాటిన నాయకుల స్థానంలో వారసులుగా సీనియర్ల ఇంటి నుంచే దిగుమతి అవుతున్నారని ప్రచారంలో ఉన్న మాట. మరి వచ్చే ఎన్నికల్లో కొత్త ముఖాలు అంటున్న జగన్ కి సీనియర్లు, టికెట్లు డౌట్లో పడ్డవారు తమ వారసులను ముందు పెడుతున్నారు అని అంటున్నారు. ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలలో కూడా చూస్తే వారసులు రెడీ అవుతున్నారు అని తెలుస్తోంది.
తిరుపతి నుంచే చూస్తే ఈసారి భూమన కరుణాకరరెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి బరిలోకి వస్తాడని అంటున్నారు. అభినయ్ రెడ్డి ఇప్పటికే తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. తండ్రి డైరెక్షన్ లో రాజకీయంగా పదును తేరారు. ఇక సీమ జిల్లాలలో చూస్త శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, చెన్నకేశవ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు తమ వారసులకే ఈసారి టికెట్ అడగాలని చూస్తున్నారు.
కోస్తా జిల్లాలలో చూస్తే మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు ఈసారి బందరు టికెట్ కోరనున్నాడని టాక్. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తనయుడికి ఈసారి టికెట్ కన్ ఫర్మ్ అంటున్నారు. ఇదే గుంటూరు నుంచి తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా తన కుమార్తె ఫాతిమాకు ఈసారి టికెట్ ఇవ్వాలని కోరబోతున్నారు.
శ్రీకాకుళం జిల్లా లో చూస్తే ధర్మాన బ్రదర్స్ పూర్తిగా రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని చెబుతున్నారు. శ్రీకాకుళం టికెట్ ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు, నరసన్నపేట టికెట్ క్రిష్ణదాస్ కుమారుడుకి ఇవ్వాలని జగన్ కి విన్నపాలు వెళ్తున్నాయట. ఇక ఆముదాలవలస టికెట్ స్పీకర్ తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ కి ఇవ్వాలని కోరుతున్నారని తెలుస్తోంది.
విశాఖ జిల్లాలో చూస్తే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈసారి మాడుగుల రేసులో ఉంటారని అంటున్నారు. గాజువాక నుంచి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఎలమంచిలి టికెట్ తన కుమారుడు డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మకు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కోరుతున్నట్లుగా చెబుతున్నారు.
విజయనగరంలో చూస్తే బొత్స సత్యనారాయణ పోటీ చేయకపోతే ఆయన కుమారుడు డాక్టర్ సందీప్ చీపురుపల్లి నుంచి వైసీపీ తరఫున బరిలో ఉంటారని అంటున్నారు. మొత్తానికి వారసుల లిస్ట్ ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు. అయితే ఇంతకీ జగన్ వారసులకు టికెట్లు ఇచ్చుకుంటూ పోతారా లేక కొత్త ముఖాలు అని పార్టీలో సీనియర్లకు టికెట్లు ఇస్తారా అన్నది చూడాలని అంటున్నారు.