Begin typing your search above and press return to search.

బుగ్గన వారసుడెవరు ? జగన్ కు పెను సవాల్ ?

By:  Tupaki Desk   |   7 April 2022 11:30 PM GMT
బుగ్గన వారసుడెవరు ? జగన్ కు పెను సవాల్ ?
X
ఏపీలో మంత్రి వ‌ర్గం మారిపోవ‌డానికి ముహూర్తం వ‌చ్చేసింది. ఇప్ప‌టికే మంత్రులు సీఎం మిన‌హా అంద‌రూ రాజీనామా చేశారు. ఈ నెల 11న కొత్త మంత్రి వ‌ర్గం కొలువు దీర నుంది. అయితే.. ఇప్పుడు ఒక విష‌యం ఆస‌క్తిగా మారింది. ఏ శాఖ ప‌నితీరు ఎలా ఉన్నా.. ప్ర‌భుత్వానికి ఇబ్బంది లేదు. కానీ, ఒకే ఒక్క శాఖ‌.. గ‌త రెండున్న‌రేళ్ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌బుత్వాన్ని అన్ని రూపాల్లోనూ ముందుకు న‌డిపిస్తోంది. గత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మేనిఫెస్టోను.. అమ‌లు చేయ‌డంలోనూ ఈ శాఖ ప‌నిచేస్తేనే సాధ్య‌మ‌వుతోంది.

అదే ఆర్థిక శాఖ‌. స‌హ‌జంగా రాష్ట్రాల‌కైనా.. కేంద్ర ప్ర‌భుత్వానికైనా.. ఆర్థిక శాఖ చాలా ముఖ్య‌మే. కానీ.. ఏపీలో ఏర్ప‌డిన భిన్న‌మైన ప‌రిస్థితులు.. ప్ర‌బుత్వ పెద్ద తీరు.. వంటివి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ఈ శాఖ చేసిం ది.... అక్ష‌రాలా.. క‌త్తిమీద సామేన‌ని చెప్పాల్సిన ప‌రిస్థితి ఉందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రాష్ట్రంలో ఒక్క పెట్టుబ‌డి లేదు. ఒక్క వ్యాపారం కూడా లేదు. కేవ‌లం.. అధిక భాగం అప్పుల‌పైనే రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం ముందుకు సాగింది. అంతేకాదు.. నెల తిరిగే స‌రికి.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వాల‌న్నా.. భ‌త్యాలు ఇవ్వాల‌న్నా కూడా. . వెతుక్కోవ‌ల‌సిన ప‌రిస్థితి ఉంది.

ఇక‌, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు.. వంద‌ల వేల కోట్ల రూపాయలు కావాల్సి వ‌చ్చిం ది. వేల రూపాయ‌ల నిధుల‌ను నేరుగా ప్ర‌జ‌లకు పంపిణీ చేయాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో వీటిని మెయిన్‌టెన్ చేసేందుకు.. అప్పులు తీసుకువ‌చ్చేందుకు.. కేంద్రంలోని ఆర్థిక శాఖ మంత్రి నుంచి ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ వ‌ర‌కు అన్నీ మెయిన్‌టెన్ చేసిన మంత్రి.. బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి. సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లి లో కూర్చొన్నా.. బుగ్గ‌న మాత్రం.. ఢిల్లీలో ఆర్థిక శాఖ వ‌ర్గాల చుట్టూ.. కాళ్ల‌కున్న చెప్పుల‌రిగేలా.. అప్పుల కోసం ప్ర‌య‌త్నించారు.

మంత్రివ‌ర్గంలోని ఒక‌రిద్ద‌రి అంచ‌నాల మేర‌కు.. బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి లాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రా న్ని అప్పుల కోసం.. అడిగిన ఆర్థిక మంత్రి లేర‌నిస‌మాచారం. అయితే.. ఇప్పుడు మంత్రిగా బుగ్గ‌న రాజేం ద్ర‌నాథ్ రెడ్డి రాజీనామా చేశారు. మ‌రి ఈయ‌న స్థానంలో ఎవ‌రు వ‌స్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. అంతేకాదు.. ఆ వ‌చ్చే నేత‌కు పెను స‌వాళ్లు ఎదురుకానున్నాయ‌ని అంటున్నారు. ఎందుకంటే.. రాష్ట్రానికి రావాల్సిన అప్పులు.. ఆర్బీఐ నుంచి నిబంధ‌న‌ల మేర‌కు తీసుకునే అప్పుల‌ను ఇప్ప‌టికే స‌ర్కారు వాడేసింది.

ఇక‌, ఇప్పుడు ఆర్థిక మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే వారు ఎవ‌రైనా.. రాష్ట్ర ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను ముందుకు తీసుకువెళ్ల‌డం అనేది పెద్ద పెను స‌వాలుతో కూడుకున్న‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇప్ప‌టికే.. లెక్క‌కు మిక్కిలిగా అప్పులు చేయ‌డం.. ఎఫ్ ఆర్ ఎంబీ ప‌రిమితి ఎప్పుడో దాటేయ‌డం.. వంటివి ప్ర‌ధానంగామంత్రికి స‌వాలుగా మారుతున్నాయి. అదేస‌మయంలో ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌జ‌ల‌కు పంచాల్సిన సంక్షేమంలో ఏ చిన్న తేడా జ‌రిగినా.. అది నేరుగా ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపే ప్ర‌మాదం ఉంది. ఈనేప‌థ్యంలో కొత్త ఆర్థిక మంత్రికి అన్నీ క‌ష్టాలే.. అంటున్నారు ప‌రిశీల‌కులు.