Begin typing your search above and press return to search.
అమ్మో అక్టోబరు 1.. రూల్స్ ఛేంజ్.. జనానికి దబిడి దబిడే
By: Tupaki Desk | 26 Sep 2022 11:30 PM GMTకొన్నాళ్ల కిందట వరకు అమ్మో ఒకటో తేదీ అనేవారు. వేతన జీవుల వేతనం వచ్చింది వచ్చినట్లే ఖర్చయిపోతున్నందనే ఆందోళనతో ఈ మాటను ప్రయోగించేవారు. అయితే, రెండు దశాబ్దాలుగా జీతాలు, ఆదాయాల్లో పెరుగుదలతో ఈ మాట కాస్త తెరమరుగైంది. అయితే, ఇతరత్రా ఖర్చులూ పెరుగుతుండడంతో ఇప్పుడు ఆ మాట మారింది. అమ్మో ఒకటో తారీఖు కాస్త ''అమ్మో జూన్''అయింది. పిల్లల చదువుల పుస్తకాలు.. స్కూలు ఫీజులు.. దుస్తులు.. ఇలా అనేక రకాల ఒత్తిళ్లతో సగటు వేతన జీవి ఆ నెలలో సతమతం అవుతుంటాడు.
ప్రభుత్వాల బాదుడూ తప్పట్లే..
ఇదివరకు ప్రభుత్వాలు సామాన్యులపై భారం విధించాలంటే ఆచితూచి ఉండేవి. అయితే, ఇప్పుడు డిజిటిలైజేషన్ తో పాటు అనేక రకాల వస్తు సేవలు పెరగడంతో మార్పు చేర్పులతో వడ్డింపులు తప్పడం లేదు. ఇదికూడా డైనమిక్ ఉంటుండడంతో సామాన్యుడు లబోదిబో అంటున్నాడు. కాగా, వచ్చే నెల 1 నుంచి కొన్ని రకాల రూల్స్ మారుతున్నాయి. ఈ నిబంధనలు తప్పనిసరి కాబోతూ సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలులోకి వస్తోంది. చలికాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం ఎప్పుడూ ఆందోళనకరమే. గ్రేడెడ్ రెస్పాన్స్ కింద.. కాలుష్యాన్ని పెంచడంలో సహాయపడే అన్ని చర్యలను నిషేధించారు. జనరేటర్ల నుంచి వాహనాల వరకు వచ్చే పొగ అందరిపైనా ప్రభావం చూపుతుంది.
సిలిండరు బండ బడ..
కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక సిలిండరు వెయ్యి మార్కును అవలీలగా దాటింది. అయితే,పెట్రోలియం కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన ఎల్పీ గ్యాస్ ధరను సవరిస్తాయి. ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి వంట గ్యాస్ ధరలు కొంత మేర పెరగవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నెలలుగా ధరలపై వినియోగదారులు ఆందోళన చెందుతుండగా.. మళ్లీ రేట్ల పెంపు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు ఉన్నప్పుడు సిలిండరు ధర రూ.500 లోపే ఉండేది. కానీ మోదీ 8 ఏళ్ల పాలనలో అది రెట్టింపైంది. అంతేగాక.. సామాన్యుల ఖాతాల్లో జమ చేసే రాయితీ దాదాపు రూ.300 నుంచి రూ.41కి పడిపోయింది. ఇక సిలిండరు ధర మరింత పెరిగితే ఇంకే జరుగుతుందో..??
ఐదు రోజులే.. జేబులు సర్దుకోండి
ఆర్థిక సంవత్సరం ఆర్నెల్లు గడిచింది. మరో ఆర్నెల్లు మిగిలుంది. అయితే, ఈలోగా జేబులు పిండేసే నిర్ణయాలు వచ్చే అక్టోబరు 1 నుంచి అమలుకానున్నాయి. సరైన ప్రణాళిక వేసుకుని సామాన్యుడు వీటిని అధిగమించాల్సి ఉంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో 5 ప్రధాన నిర్ణయాలు జనం మీద ప్రభావం చూపనున్నాయి. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలో ఒకటి ఉంది. అక్కడి ఆప్ ప్రభుత్వం సెప్టెంబర్ 31 తర్వాత కరెంటు బిల్లుపై ఇచ్చే సబ్సిడీని నిలిపివేయనుంది. ఈ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ప్రయోజనం లభిస్తుంది.
కార్డుదారులూ కాస్త చూడండి
ఇప్పుడంతా ఆన్ లైన్ చెల్లింపులే. క్రెడిట్ డెబిట్ కార్డుల వాడకం మరీ పెరిగింది. వీటి విషయంలోనూ నిబంధనలు మారుతున్నాయి. ''టోకెనైజేషన్''తప్పనిసరి కాబోతోంది. కార్డుల వినియోగం పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. టోకనైజేషన్ సిస్టమ్‌లో మార్పు తర్వాత, కార్డు హోల్డర్లు చెల్లింపులు చేయడంలో కొత్త అనుభూతిని పొందుతారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే, తాజా మార్పుతో గతంలో కంటే డెబిట్, క్రెడిట్ కార్డులతో లావాదేవీలు మరింత సురక్షితం అని
నిపుణులు చెబుతున్నారు.
మ్యూచువల్ ఫండ్స్ నిబంధనల మార్పు..
కాస్త డబ్బు, ఇంకాస్త తెలివి.. మరికాస్త ఆలోచన ఉన్నవారు చేసే పని మ్యూచ్ వల్ ఫండ్లలో పెట్టుబడులు. అయితే, అక్టోబరు 1 తర్వాత ఇలా పెట్టుబడులు పెట్టేవారు నామినేషన్ వివరాలు కచ్చితంగా ఇవ్వాలి. లేదంటే డిక్లరేషన్ నింపాలి. నామినేషన్ సదుపాయాన్ని డిక్లరేషన్‌లో ప్రకటించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇది ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తుందని భావించారు. కానీ, గడువు పొడిగించారు.
పన్ను కడుతున్నారా...? పింఛను బందే
సామాజిక భద్రతా పథకం కేంద్రం ప్రభుత్వం అటల్ పింఛను యోజనలో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఈ పథకం లబ్ధిదారులైన వ్యక్తులు అక్టోబరు 1 నాటికి ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లైతే వారు పింఛను పొందడానికి అనర్హులని కేంద్రం స్పష్టం చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.