Begin typing your search above and press return to search.
దాసన్న ఇలాకాలో సరికొత్త తలనొప్పులు !
By: Tupaki Desk | 5 May 2022 3:10 AM GMTదాసన్నకు ఎదురేలేదు అని అన్నారు నిన్నంతా ! ఇప్పుడు ధర్మాన ప్రసాదరావుకు ఎదురే లేదు అని అంటున్నారంతా! అంటే పదవి మహత్యం కారణంగానే ఇవన్నీ వినపడుతున్నాయా ? లేదా కేవలం ఆధిపత్యం, అహంకారం అన్నవి ఇలాంటివేవో ఇతర నాయకులతో అనిపించేలా చేస్తున్నాయా? ఇవే ఇప్పుడు శ్రీకాకుళం రాజకీయాలను ముఖ్యంగా వెలమ సామాజికవర్గ నేతలను మరింత అంతర్మథనానికి గురి చేస్తున్నాయి.
అంతర్గత కుమ్ములాటలు కనుక దాసన్న నిలువరించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన చుక్కలు చూడడం ఖాయం. కానీ ఆయన ఇవేవీ పట్టించుకోకుండా తనదైన ధోరణిలో కొన్ని సార్లు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తూ కొన్ని సార్లు అసహనం ప్రదర్శిస్తూ ఆవేశంతో ఊగిపోతూ స్టేజీ పై ఉన్నామన్న ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఇవే ఇప్పుడు అత్యంత వివాదాస్పద విషయాలు.. కావొచ్చు.. కాకపోవచ్చు కూడా ! అధిష్టానం పట్టించుకోకపోతే కాదు కదా! అందుకే ఆ విధంగా భావించి తప్పుకోవాలి మనం.
దాసన్న ఇలాకా, మాజీ డిప్యూటీ సీఎం దాసన్న ఇలాకా, నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఇలాకాలో చాలా అంటే చాలా గొడవలు జరుగుతున్నాయి. తమ్ముడికి పోస్టు దక్కిన నాటి నుంచి, రెవెన్యూ మంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు అందుకున్న నాటి నుంచి ఆయన (దాసన్న) కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు.
ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు వర్గాన్ని బాగా అణిచి వేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ప్రసాదరావు మనుషులకు కనీస గౌరవం కానీ మర్యాద కానీ లేవు. పైకి మేం ఇద్దరం ఒక్కటే.. ఒకే అమ్మ బిడ్డలం అని చెబుతున్నా లోపల కథ వేరుగా ఉంది. అంతర్మథన రీతి వేరుగా ఉంది.
కల్లోలిత ప్రావస్థలు కూడా వేరుగానే ఉంటాయి. ఉండాలి కూడా ! అన్న విధంగా అక్కడ రాజకీయం నడుస్తోంది. తమ్ముడికి ఎదురెళ్లి రాజకీయం చేయాలంటే సాధ్యం కాకపోయినా, వీలున్నంత వరకూ తమ్ముడి మనుషులను నిలువరిస్తే ఓ విధంగా ఆయనపై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు అన్న భావన దాసన్నది కావొచ్చు. ఇటీవలే ఇక్కడ టీడీపీ బలోపేతం అవుతోంది. కింజరాపు కుటుంబానికి మంచి క్రేజ్ వస్తోంది. ఒకవేళ రేపటి ఎన్నికల్లో యువ ఎంపీ రామూ ఇక్కడి నుంచి పోటీ చేస్తే దాసన్న అడ్రస్ గల్లంతే!
ఇక ఇంటి పోరు గురించి మాట్లాడితే.. దాసన్న ఇలాకా లో సొంత మనుషులే ఆయన పై తిరుగుబాటు చేస్తున్నారు. త్వరలో ఎంపీటీసీలు, సర్పంచ్ లు వేరే పార్టీ గూటికి చేరినా చేరిపోవచ్చు. నిన్నటివేళ నరసన్నపేట లో సమావేశం అయిన అసంతృప్తి వాదులు తమ పోరు దాసన్నపై కాదని చెబుతూ ఆయన కోటరీ పై యుద్ధం ప్రకటించి సంచలనాత్మకం అయ్యారు. ఇదే విధంగా ముందున్న కాలంలోనూ సాగితే దాసన్నకు ప్రమాదమే !