Begin typing your search above and press return to search.
కొత్త ఆశ: మే చివరికి మహమ్మారికి చెక్
By: Tupaki Desk | 8 March 2021 5:03 AM GMTతగ్గినట్లే తగ్గి మళ్లీ విరుచుకుపడటం మాయదారి కరోనాకు అలవాటే. దేశంలో విరుచుకుపడిన కరోనా కేసులు.. కొద్దికాలంగా తగ్గటం.. ఊపిరి పీల్చుకుంటున్న వారికి.. కొత్త భయాన్ని కలిగిస్తూ.. కేసుల సంఖ్య ఇటీవల కాలంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశం మొత్తమ్మీదా ఆరు రాష్ట్రాల్లోకరోనా కేసుల నమోదు ఎక్కువగా ుందని చెప్పాలి. ఇప్పటివరకు మహారాష్ట్ర.. పంజాబ్ రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్య పెరుగుతుండగా.. తాజాగా మరికొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగటం మొదలైంది.
జనవరి 15 వరకు రోజుకు 300 కంటే తక్కువ కేసులు నమోదైన ఢిల్లీలో ఇప్పుడు 300లకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గుజరాత్ లోనూ అలాంటి పరిస్థితే ఉంది. కేరళ.. కర్ణాటక.. తమిళనాడులోనూ ఇటీవల కాలంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రయాణాల్లో ఆంక్షలు తొలగించటం.. శానిటైజ్ చేసే విషయంలో నిర్లక్ష్యం వహించటం.. భౌతికదూరాన్ని పాటించకపోవటం.. మాస్కులు లేకుండా బయట తిరగటం లాంటి తీరుతో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే.. టీకా కార్యక్రమం మరింత జోరుగా సాగితే.. కరోనాకు చెక్ చెప్పటం అంత కష్టమైన పని కాదంటున్నారు.
దేశంలో రోజుకు15 లక్షల టీకాలు వేస్తున్నారు. ఇప్పటివరకు కరోనా వారియర్స్.. పెద్ద వయస్కుల వారితో పాటు.. కోమార్బటీస్ వారికి మాత్రమే టీకాలు వేస్తున్నారు. అందరికిటీకాలు వేయటం షురూ చేస్తే.. కరోనాను కంట్రోల్ చేయటం సాధ్యమవుతుందని చెబుతున్నారు. 30 ఏళ్లు దాటిన వారికి.. కోమార్బిడిటీస్ లక్షణాలు లేని వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వగలిగితే.. కొత్త కేసుల నమోదు తగ్గుతుందని చెప్పక తప్పదు.
ఇప్పటికే యాంటీ బాడీలు పెద్ద ఎత్తున ప్రజలకు వచ్చాయని.. ఇదో శుభ సంకేతంగా చెప్పాలి. వ్యాక్సినేషన్ మరింత పెంచితే.. దేశంలోకరోనాను కంట్రోల్ చేయటం సాధ్యమేనని చెబుతున్నారు. మే చివరకు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్న అంచనాను హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ డైరెక్టర్ జీవీఎస్ మూర్తి తెలియజేశారు.
దేశంలో కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న ఆరు రాష్ట్రాల విషయానికి వస్తే..మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిస్తే.. కేరళ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో పంజాబ్.. నాలుగో స్థానంలో కర్ణాటక.. ఐదో స్థానంలో గుజరాత్.. ఆరో స్థానంలో తమిళనాడు ఉంది. దేశంలో రోజు నమోదయ్యే కేసుల్లో 85 శాతం కేసులు ఈ ఆరు రాష్ట్రాల్లోనే నమోదు కావటం గమనార్హం.