Begin typing your search above and press return to search.
కొత్త ఆశలు.. చంద్రుడిపై ఆక్సిజన్
By: Tupaki Desk | 14 Nov 2021 11:30 AM GMTఇప్పుడు కాకున్నా మరో వంద ఏళ్ల కు అయినా మానవుడు భూమిని కాకుండా మరేదైనా గ్రహం పై నివాసం ఏర్పర్చుకోవడం ఖాయం. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల చంద్రుడి పైనే కాకుండా పలు గ్రహాలు మరియు అంతరిక్షం లో ఉన్న ఇతర విషయాల గురించి పరిశోధనలు చేస్తున్నారు. చంద్రుడిపై నివాసం కు అనువైన మార్గాలు ఉండవచ్చు అని ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఒకవేళ చంద్రుడిపై కనుక నీరు మరియు ఆక్సిజన్ కనుక ఉంటే ఖచ్చితంగా తక్కువ సమయంలోనే అక్కడ నివాసాలు ఏర్పాటు అవ్వడం జరుగుతుంది అంటూ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే చంద్రుడిపై జరిగిన పరిశోధనలు పలు విషయాలను తెలిసేలా చేశాయి. అక్కడ ఆక్సిజన్ ఉందా అని విషయంలో చాలా రోజులుగా జరుగుతున్న పరిశోధనలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగంలో చంద్రుడి పై నుండి తెచ్చిన మట్టిలో ఆక్సిజన్ ఉన్నట్లుగా గుర్తించారు. కానీ అది తక్కువ పరిమాణంలో ఉన్నది అంటూ వారు చెబుతున్నారు.
రిగోలిథ్ చంద్రుడి ఉపరితలంపై ఉంది అని గుర్తించారు. రిగోలిథ్ లో 45% వరకు ఆక్సిజన్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై ఒక్కో క్యూబిక్ మీటర్ కు 630 కేజీ ల రిగోలిథ్ ఉందని వారు చెబుతున్నారు. ఒక మనిషి బతకడం కోసం ప్రతి రోజు 800 గ్రాముల ఆక్సిజన్ అవసరం. ఆ లెక్కన చూస్తే చంద్రుడిపై ఉన్న రిగోలిథ్ నుండి ఆక్సీజన్ తో 800 కోట్ల మంది లక్ష సంవత్సరాలు బతికేయ వచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటి అంటే రిగోలిథ్ నుండి పెద్ద మొత్తంలో ఎలా ఆక్సిజన్ ను విడదీసి దాన్ని మనిషి వాడుకోవడం ఎలా.. ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే ఏళ్ల లో ఖచ్చితంగా దొరకడం ఖాయం. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం త్వరలోనే చూస్తారని అంత ఆశిస్తున్నారు.