Begin typing your search above and press return to search.
అందుకే.. సార్ వద్దన్నారు.. వైసీపీలో ఒక్కటే హాట్ టాపిక్..!
By: Tupaki Desk | 1 Dec 2021 7:30 AM GMTవైసీపీలో ఒక విషయం ఆసక్తిగా వినిపిస్తోంది. `సార్ వద్దన్నారు.. అందుకే!` అంటూ.. నేతల మధ్య ఫోన్ సంభాషణలు సాగుతు న్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. మంగళవారం.. జగన్ పాలనకు రెండున్నరేళ్లు పూర్తయింది. దీంంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు వారం కిందటే నేతల నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. దీనిని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పంపించారు. అయితే.. అప్పటి నుంచి దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా.. తొక్కి పెట్టారు.
అంతేకాదు..``మేం చెబుతాం!`` అని ఫోన్ సందేశం పంపించారట. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం సీఎం జగన్‌కు అత్యంత వీరాభిమానులు మాత్రం.. భారీ ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తాడేపల్లి నుంచి `ఊ` అనే ఆదేశం రావడమే ఆలస్యం! అన్నట్టుగా వారు ఉన్నారు. ఇక, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సంబరాలు చేసుకుందామనే అనుకున్నారు. అయితే.. ఎంత ఎదురు చూసినా.. తాడేపల్లి నుంచి `ఊ లేదు.. ఊహూ లేదు` అన్నట్టుగా పరిస్థితి ఉండేసరికి .. అందరూ మౌనంగా ఉన్నారు.
కట్ చేస్తే.. ఇదే విషయం.. సీనియర్ నేతల మధ్య ఆసక్తిగా చర్చకు దారితీసింది. ``ఎందుకు ఇలా జరిగింది? మా వోళ్లు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, ఏం చేయాలో తెలియక నీరు గారి పోయారు`` అంటూ.. నాయకులు ఎక్కువ మంది చర్చించుకున్నారు. అయితే.. దీనికి ఎవరూ ఇతమిత్థంగా సమాధానం చెప్పలేదు. కానీ.. ఒక విషయం మాత్రం చర్చకు వస్తోంది.
ఒకవైపు రాష్ట్రంలో నాలుగు జిల్లాలు ఇంకా వర్షం ప్రభావంతో నే అల్లాడుతున్నాయి. దీంతో ఆ జిల్లాలను అలా వదిలేసి సంబరాలు చేసుకుంటే భావ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. అదేస మయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే విమర్శలు చుట్టుముట్టాయి. ఇప్పటికే.. తమ నిధులు వాడేశారంటే.. తమ నిధులు తీసుకున్నారని.. పంచాయతీలు, ఎన్టీఆర్ వర్సిటీ ఉద్యోగులు.. గగ్గోలు పెడుతున్నారు. ఇక, కాగ్ నివేదిక కూడా ప్రభుత్వం అప్పులు చేస్తోందని.. గట్టిగానే హెచ్చరించింది.
అసలు చేస్తున్న అప్పులకు.. పొంతన ఉండడం లేదని.. అసెంబ్లీకి కూడా చెప్పకుండానే అప్పులు చేస్తున్నారని.. పేర్కొంది. దీంతో ఇప్పుడు రెండున్నరేళ్ల సంబరాలు చేసుకుని.. ఏం సందేశం ఇస్తామనే ఉద్దేశంతోనే.. వైసీపీ అధినేత సహా.. కీలక సలహాదారు కూడా ఈ సంబరాలకు దూరంగా ఉన్నారని.. అంటున్నారు.