Begin typing your search above and press return to search.
ట్విట్టర్ కి షాక్ ఇచ్చిన కొత్త ఐటీ శాఖ మంత్రి !
By: Tupaki Desk | 8 July 2021 4:30 PM GMTగత కొద్ది రోజులుగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విటర్ కి , కేంద్రానికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ నియమాలని అమలు చేయడానికి ట్విట్టర్ నిరాకరించడంతో వివాదం మొదలైంది. కేంద్రం ఇచ్చిన గడువు ముగియడంతో ట్విట్టర్ కి మధ్యవర్తి హోదాను కూడా తొలగించింది. దీనితో దేశంలో ట్విట్టర్ పై కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఐటీశాఖ మంత్రిగా ఈ రోజే బాధ్యతలు చేపట్టిన అశ్విని వైష్ణవ్ , భాద్యతలు స్వీకరించిన రోజే సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేలపై రూపుదిద్దుకున్న చట్టాలే అత్యున్నతమని, కచ్చితంగా కొత్త ఐటీ రూల్స్‌ను ట్విట్టర్ పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఇటీవల ట్విట్టర్ సంస్థకు, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మాజీ ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పలు మార్లు ట్విట్టర్ కు ఈ తరహా వార్నింగ్ లే ఇచ్చారు. కానీ ట్విట్టర్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. నేడు ఢిల్లీ హైకోర్టులోనూ ట్విట్టర్ కేసు విచారణకు వచ్చింది. 8 వారాల్లోగా గ్రీవియన్స్ ఆఫీసర్ ను నియమించనున్నట్లు ఆ సంస్థ కోర్టుకు చెప్పింది. రూల్స్ పాటించడం లేదని కోర్టు హెచ్చరించిన రెండు రోజుల తర్వాత ట్విట్టర్ ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రీవియన్స్ ఆఫీసర్ ను పెట్టాలని కేంద్రం కోరినా ట్విట్టర్ మాత్రం స్పందించడంలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆ సంస్థకు వార్నింగ్ ఇచ్చింది. కావాల్సినం సమయం ఇవ్వలేమని హైకోర్టు జస్టిస్ రేఖా పాలి తన తీర్పులో అన్నారు.
ఇదిలా ఉంటే .. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా 43 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ప్రమాణాలు చేశారు. వీరిలో 15 మందికి కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులు. దీంతో కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య 78కి పెరిగింది. వీరిలో 31 మంది కేబినెట్ హోదా మంత్రులు కాగా, మిగిలినవారు సహాయ మంత్రులు. కేంద్ర హోం, విదేశాంగ శాఖలకు ముగ్గురేసి సహాయ మంత్రులని కేటాయించారు.
భారత్ లో సామాజిక మాధ్యమాలు, వార్తాసైట్లు, ఓటీటీ వేదికలకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్రం ఫిబ్రవరిలో ప్రకటించింది. వీటి ప్రకారం.. ఆయా సంస్థలు.. దేశంలో వీటి పేరు, చిరునామా, అధికారుల వివరాలు తమ యాప్‌ల్లో, సైట్లలో స్పష్టంగా తెలియజేయాలి. నెటిజన్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి దేశీయంగా అంతర్గత యంత్రాంగం ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట గడువులోగా వాటిని పరిష్కరించాలి.అభ్యంతరకరమైన కంటెంట్ పై పర్యవేక్షణ, వాటి తొలగింపు , తదితరాల వివరాలు నెలకోసారి అందజేయాలి. దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారం, పోస్టులు పెడితే, వాటి మూలాలను (మెసేజ్‌లోని వివరాలు ఇవ్వకున్నా) ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.ఎవరైనా వినియోగదారుల సందేశాలనుగానీ, వారి అకౌంట్లనుగానీ సామాజిక మాధ్యమం తొలగిస్తే వారికి తమ వాదన వినిపించుకోవటానికి తగిన సమయం కల్పించాలి.సామాజిక మాధ్యమాలపై వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వంలోని ఓ ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది. వాస్తవానికి ఈ నిబంధనలు ఫిబ్రవరిలోనే అమల్లోకి వచ్చినా.. దిగ్గజ సామాజిక వేదికలకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3 నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు మే 25తో ముగియడం వల్ల మే 26 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సామాజిక మాధ్యమ వేదికలన్నీ ఈ రూల్స్ కు కట్టుబడి ఉండాలి. లేని పక్షంలో ఇన్నాళ్లూ వాటికి రక్షణ గోడగా నిలుస్తున్న 'మధ్యవర్తి హోదా' రద్దవుతుందని కేంద్రం గతంలోనే హెచ్చరించింది.