Begin typing your search above and press return to search.

నోట్ల రద్దు లెక్క ఎవరికి వారు చెప్పాల్సిందేనట

By:  Tupaki Desk   |   31 March 2017 4:46 AM GMT
నోట్ల రద్దు లెక్క ఎవరికి వారు చెప్పాల్సిందేనట
X
పెద్ద నోట్ల రద్దు ముచ్చట ఇప్పట్లో పూర్తి అయ్యేలా కనిపించట్లేదు. రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత.. తమ దగ్గరున్నపెద్దనోట్లను బ్యాంకులకు తీసుకెళ్లి తమ ఖాతాల్లో డిపాజిట్ చేసిన వైనం తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని పరిమితులు విధించటం.. దాన్నిక్రాస్ చేసిన వారు మాత్రమే చట్టం పరిధిలోకి వెళతారన్న విషయం తెలిసిందే. అయితే.. ఎవరికి వారు.. బ్యాంకుల్లో ఎంతెంత డిపాజిట్ చేసిన విషయాన్ని వెల్లడించేలా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వేళలో.. ఆదాయపన్నుశాఖకు రిటర్న్ సమర్పించే ముచ్చట తెలిసిందే. ఈ సందర్భంగా ఉండే ఫాంలో.. ఆధార్ నెంబరుతో పాటు.. పెద్ద నోట్ల రద్దు వేళలో.. ఎంతమొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేశారన్న విషయాన్ని వెల్లడించాల్సిందిగా కోరనున్నారు.

గత ఏడాది నవంబరు 8 నుంచి డిసెంబరు30 వరకు బ్యాంకుల్లో జమ చేసిన నగదు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో జమ చేసిన వివరాల్ని జీతమే ఆదాయంగా ఉండే వ్యక్తులు తాము సమర్పించే ఐటీఆర్ 1 లేదా సహజ్ ఫారంలో వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక ప్రత్యేక కాలమ్ ను ఏర్పాటు చేశారు. కాలమ్ లో బ్యాంకుల్లో జమ చేసిన మొత్తాన్ని వెల్లడించటంతో పాటు.. తమ ఆధార్ సంఖ్యను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ రిటర్న్ ను జులై31 లోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. సో.. వేతన జీవులతో పాటు.. ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసే వారు తమ జమ మొత్తాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఏదో బ్యాంకులో జమ చేశామని అనుకుంటే సరిపోదన్న విషయం.. తాజా నిర్ణయంతో తప్పని చెప్పినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/