Begin typing your search above and press return to search.

కొత్త జాబ్.. జలకన్యకు రూ.6 లక్షల జీతం

By:  Tupaki Desk   |   11 Sept 2022 5:00 AM IST
కొత్త జాబ్.. జలకన్యకు రూ.6 లక్షల జీతం
X
జలకన్యలు, సాగరకన్యలు సినిమాల్లో ఉంటాయి.. బయట కనిపించడం కల్లా.. కానీ అలాంటి డ్రెస్సులు వేసుకొని కనిపించేవారుంటారు. మన వెంకటేశ్ నటించిన ‘సాహసవీరుడు.. సాగరకన్య’ సినిమాలో జలకన్యగా శిల్పాశెట్టి అద్భుతంగా నటించింది. ఆ ఊహ ఇప్పుడు నిజం కాబోతోంది. ఇక హాలీవుడ్ లో ‘ఆక్వా మ్యాన్’ సినిమా వచ్చి విజయం సాధించింది. అయితే ఇప్పుడు జలకన్య లాంటి ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నారు. విదేశాల్లోని వాటర్ థీమ్ పార్కుల్లో జలకన్యలా వేషం వేసి అలరించడం కోసం ఈ జాబ్ ఆఫర్ చేస్తున్నారు.

జలకన్యలా వేషం వేసుకొని థీమ్ పార్క్ లోని నీటిలో అలరించేవారికి విపరీతమైన జీతాలు చెల్లించేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఓ 32 ఏళ్ల మహిళా డిస్నీ క్యారెక్టర్ ఏరియల్ లాగా దుస్తులు ధరించి మేకప్ వేసుకొని నెలకు రూ.8వేల డాలర్లను ఆర్జిస్తోంది. మన భారత కరెన్సీలో దీని విలువ రూ.6 లక్షలు కావడం విశేషం.

1989లో విడుదలైన ‘ఏరియల్’ వాల్ట్ డిస్నీ పిక్చర్స్ 28వ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, ది లిటిల్ మెర్మైడ్ లో ఒక కల్పిత పాత్ర. ఈ కథను హన్స్ క్రిస్టియన్ అండర్సన్ 1837లో ‘ది లిటిల్ మెర్మైడ్’ పేరుతో తీశాడు. 1989లో ఇదే యానిమేషన్ రూపంలో వచ్చింది. అప్పటి నుంచే జలకన్య పాత్రకు మంచి ఆదరణ దక్కుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా గుగ్లిల్మో అనే 32 ఏళ్ల మహిళ ప్రస్తుతం అమెరికాలోని ప్రఖ్యాత ఫైవ్ స్టార్ ఈవెంట్ లు, పిల్లల పార్టీల్లో జలకన్యలా మారి ప్రదర్శనలు ఇస్తోంది. గుగ్లీల్మో మత్య్సకన్యగా మారి పాల్గొంటున్న షోలో టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ లో, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా చాలా మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.

22 ఏళ్ల వయసు నుంచే గుగ్లిల్మో అనేక పార్టీలు, షోలల్లో థీమ్ పార్కుల్లో జలకన్యగా పనిచేస్తోంది. ఈ 10 ఏళ్లలో నెలవారీ జీతం 8వేల డాలర్లను సంపాదిస్తూ లక్షలు వెనకేసుకుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.