Begin typing your search above and press return to search.
జనసేనలో కి ఉత్తరాంధ్ర సీనియర్ నేత
By: Tupaki Desk | 20 Dec 2018 11:15 AM GMTతెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఓ వెలుగు వెలిగి... అనంతరం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ రాజకీయవేత్త దాడి వీరభద్రరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. వైసీపీలో ఉన్న సమయంలో ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినప్పటికీ, పలు కారణాల వల్ల దాడి వీరభద్రరావు బయటకు వచ్చేశారు. దాదాపు నాలుగేళ్లుగా ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఒక దశలో ఆయన తిరిగి తెలుగుదేశం- వైసీపీలోకి వెళ్లాలనుకున్నా, అనివార్య కారణాల వలన అది సాధ్య కాలేదు. అయితే, ఆయన తాజాగా జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కానీ, శాశ్వత మిత్రుత్వం కానీ ఉండదంటారు. దాడి వీరభద్రరావు రాజకీయాల్లో ఇంకా కొనసాగాలనుకున్నా, లేక ఆయన కుమారుడు రత్నాకర్‌ను రాజకీయ ఊతం ఇవ్వాలన్నా, దాడి మళ్లీ ఏ పార్టీలోనైనా చేరాల్సిన అవసరం ఉంది. అది ఏది అన్నది త్వరలోనే తేలేట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న దాడి వీరభద్రరావు ఈ మేరకు జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, దాడి వీరభ్రదరావుకు ప్రత్యేకంగా అనుచరులు అంటూ లేరు. ఈ నేపథ్యంలో ఆయన వెంట నడిచేవారెవరు? దాడి చేరికకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్తారా? అనేది క్లారిటీ రావడం లేదు.