Begin typing your search above and press return to search.

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ ఇదే..

By:  Tupaki Desk   |   3 Oct 2019 10:37 AM GMT
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ ఇదే..
X
తెలంగాణలో అమలు చేయబోయే కొత్త మద్యం విధానం రెడీ అయ్యింది. ఈ విషయంపై తాజాగా తెలంగాణ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 4 స్లాబులు ఉన్న లైసెన్స్ ఫీజును 6 స్లాబులుగా తెలంగాణ సర్కారు మార్చింది. 5వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారు.

మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 2216 దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపికచేస్తారు.

ఇక మద్యం దుకాణాలను తెరిచి ఉంచే సమయాన్ని ప్రభుత్వం మార్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు.. ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

5వేల లోపు 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును రూ55 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 50వేల నుంచి లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షల ఫీజు, లక్ష నుంచి 5 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్ల లైసెన్స్ ఫీజును ఖరారు చేశారు.